The South9
The news is by your side.
after image

మీ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్, కుప్పానికి నాన్‌ లోకల్‌ :సీఎం జగన్

*కుప్పం వద్దు, హైదరాబాద్ ముద్దు: ఇదీ చంద్రబాబు పాలసీ*

Post Inner vinod found

కుప్పం బహింరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ …

మీ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్, కుప్పానికి నాన్‌ లోకల్‌:
కుప్పానికి బాబు ఏంచేశాడో చెప్పడానికి లేదు కానీ, ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉంది:
ఈయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యే:
ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు, తీసుకున్నాడు:
ప్రజలకు ఏం చేయాలన్నదానిపై ఆలోచన మాత్రం చేయలేదు:
మంచి చేయాలన్న తపన, తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు:
14 ఏళ్లు సీఎంగా ఉండికూడా కుప్పంలో కరువుకు చంద్రబాబు పరిష్కారం చూపలేకపోయాడు:
కేంద్రంలో రాష్ట్రపతులను మారుస్తానంటాడు, కేంద్రంలో ప్రధానమంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకుంటా ఉంటాడు:
కేంద్రంలో చక్రం తానే తిప్పానని చెప్పే బాబు చివరకు నియోజకవర్గంలో పంపులు తిప్పితే.. నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకుని రాలేకపోయాడు:
కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అదిచేస్తే.. ప్రజలను తన మాట వినరని భయపడిపోయాడు:
అందుకే ఆ హంద్రీనీవా పనులకు కూడా అవరోధంగా తానే మారాడు:
14 ఏళ్లు సీఎంగా ఉన్నా దీని గురించి పట్టించుకోలేదు:
ఎన్నికలు వచ్చే సరికి తన పార్టీకి చెందిన వారికి మాత్రం ఈ కాంట్రాక్టు ఇచ్చాడు:
కమీషన్లకోసం కక్కుర్తిపడ్డాడు తప్ప, కుప్పంకు మాత్రం నీళ్లు తెప్పించుకోలేకపోయాడు:
వందలకొద్దీ ట్రాక్టర్లతో తాగునీరు పంపిణీ చేశానని చెప్పి.. విపరీతంగా దొంగ అక్కౌంట్లతో దోచేశాడు:
ఆ ట్రాక్టర్లు లేకుండా కుప్పానికి నీళ్లు ఇవ్వగలిగితే.. ఎంత బాగుటుందన్న.. ఆలోచన చేయలేకపోయాడు:
కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకు లింక్‌ఇస్తాన్నాడు.. అదికూడా చేయలేదు:
కుప్పం మున్సిపాల్టీలో కనీసం డబుల్‌రోడ్డుకూడా వేయలేకపోయాడు ఈ పెద్దమనిషి:
ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు:
ఎన్నికలప్పుడు మాత్రం.. ఏకంగా కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతానని కుప్పం ప్రజలకు పువ్వుపెట్టాడు:
ఇదే పెద్దమనిషి జాబు కావాలంటే.. బాబు రావాలని అంటాడు. ఎన్నికలయ్యాక జాబులు ఉండవు, బాబు పట్టించుకోడు:
నిత్యం 5వేలమంది ఉపాధికోసం బెంగుళూరు, చెన్నైకోసం ఉపాధికోసం వెళ్తాడు:
ఇక్కడ వాళ్లకు ఉద్యోగాలు చూపించాలన్న ఆలోచన ఈ పెద్ద మనిషికి రాదు:
చంద్రబాబు ఏరోజూ ఈ నియోజకవర్గంలో ఉండడు, ఇక్కడకు రాడు, పట్టించుకోడు:
14 ఏళ్లు సీఎంగా ఉండేందుకు తనకు కుప్పం సహకరించినా, చివరకు రెవిన్యూ డివిజన్‌కూడా ఏర్పాటు చేయలేకపోయాడు:
చివరకు రెవిన్యూ డివిజన్‌కోసం జగన్‌కు లేఖరాస్తాడు:
కాని, జగన్‌ మీవాడు, మంచోడు, మీ బిడ్డ:
మీరు అడిగారు, జగన్‌ రెవిన్యూ డివిజన్‌కుప్పానికి ఇచ్చారు:
చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా?
చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా?
దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్భుద్ధి అనాలా?
కుప్పంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీలేదు, మెడికల్‌కాలేజీ లేదు:
ప్రతి ఎన్నికల్లో దొంగోట్లు వేయించడానికి మాత్రం చంద్రబాబుకు అనుభవం గురించి ఈ జిల్లాలో కథలు కథలుగా చెప్తారు:
వెన్నుపోటుకు, దొంగ ఓట్లకు 30 ఏళ్లుగా కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరంటే.. అది చంద్రబాబు:
చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయనికి ఇక తల వంచేది లేదని కుప్పం ప్రజలు నిర్ణయించుకుంటే.. అభివృద్ధివైపు ఒకసారి చూస్తే.. ఎలా ఉంటుందో.. ఒక్కసారి చూస్తే. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చూపించారు:
అన్నింటా కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ క్లీన్‌స్వీప్‌చేసింది:
కుప్పంలో ప్రజలు డీబీటీ..కి ఓటేశారు:
ఒక్కమాటలంటే చెప్పాలంటే.. తమ బిడ్డ జగన్‌కి ఓటేశారు:
కుప్పం ప్రజలు దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీకి వ్యతిరేకంగా ఓటు వేశారు:
33 ఏళ్లుగా గెలిపించినా కూడా.. చంద్రబాబుకు ఇక్కడ సొంత ఇల్లు లేదు:
సొంతిల్లు సంగతి దేవుడు ఎరుగు, కాని, సొంత ఓటు కూడా లేదు:
కుప్పం తన సొంతం అని చంద్రబాబు ఏనాడూ భావించలేదు:
సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఇంద్రభవనం కట్టుకున్నాడు తప్ప, కుప్పంలో ఇల్లు కట్టుకోలేదు చంద్రబాబు:
బీసీలకు న్యాయం చేశానని రెండు రోజుల క్రితం చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పాడు:
కుప్పంతో మొదలుపెడితే బీసీలకు ప్రతిచోటా అన్యాయం చేశాడు:
కుప్పంలో ఓసీలు పోటీచేయాల్సిన సీటు కాదు, బీసీల సీటు :
అత్యధికంగా ఉన్నవారు బీసీలు :
మరి అలాంటిది ఈ సీటు బీసీలకు ఇవ్వకుండా, ఈ బీసీలకు సంబంధించిన సీటునుకూడా లాక్కున్నారు:
సామాజిక న్యాయం గురించి చంద్రబాబు మాట్లాడితే ఎలా ఉంటుంది:
1983 నుంచి 2019 వరకూ ఈ 36 సంవత్సరాల్లో ఒక్కసారంటే.. ఒక్కసారికూడా టీడీపీ బీసీలకు టిక్కెట్టు ఇక్కడ ఇవ్వలేదు:
ఇది బాబు మార్క్‌ సామాజిక న్యాయం:
ఆలోచన చేయమని అడుగుతున్నా…:
బీసీలు వాడుకుని, విడిచిపెడుతున్నది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి:
మన పరిపాలనలో కుప్పంలో ఏం జరిగిందో నాలుగు మాటలు చెప్తాను:
మనం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల 3 నెలలు అయ్యింది:
6 నెలల్లో హంద్రీనీవా కుప్పం బ్రాంచ్‌కెనాలన్‌ను పూర్తిచేస్తున్నాం:
కుప్పంలో మున్సిపాల్టీగా చేసింది మనమే:
కుప్పం మున్సిపాల్టీకి రూ.66 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చింది మీ బిడ్డ:
55 ఏళ్లుగా కలగామిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు కుప్పంలో ఏర్పాటు చేసింది.. మీ బిడ్డే:
6.5 కోట్లతో రెడ్డిపల్లి– రామకుప్పం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఇచ్చిందీ మీబిడ్డే:
కొత్తపేట నుంచి డీకే పల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి పూర్తిచేసింది మీ బిడ్డే:
రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌కాంప్లెక్స్‌ పూర్తిచేసింది కూడా మీ బిడ్డే:
ఒకేషనల్‌జూనియర్‌కాలేజీ పనులు పూర్తి చేసింది.. మీ బిడ్డే:
కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా మీ బిడ్డే:
రాళ్ల మడుగూరు జూనియర్‌కాలేజీ పనులు పూర్తిచేసింది మీ బిడ్డే:
నవరత్నాలు పథకాలు అన్నీకూడా కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా.. కుప్పంలో అంతా నావాళ్లే అని అమలు చేశాం:
డీబీటీ ద్వారా కుప్పం నియోజకవర్గంలో రూ.866 కోట్లు ఇచ్చాం:
నాన్‌డీబీటీ ద్వారా మరో రూ.283 కోట్లు ఇచ్చాం:
అంటే మొత్తంగా 39 నెలలకాలంలో ఇంటింటికీ మంచి చేస్తూ కేవలం కుప్పం నియోజకవర్గానికి రూ.1149 కోట్లు మీ బిడ్డ ఇచ్చాడు:
మంచి జరగాలని మనసుతో ఇవన్నీచేసింది మీ బిడ్డే:
ఇవన్నీ చూసిన తర్వాత.. ఎవరికైనా అర్థం అయ్యేది.. చంద్రబాబుకు సొంతమామ మీద ఎలాంటి ప్రేమ ఉందో, కుప్పం మీదకూడా అలాంటి వెన్నుపోటు ప్రేమే ఉంది:
సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికీ, మనం చూస్తున్న విధానానికీ మధ్య తేడాను అందరూ చూడాలి:
అభివృద్ధి అన్నది ప్రతి ఇంట్లో పిల్లాడు చదువులోనూ, రైతులోనూ, ఆరోగ్యరంగంలో, అక్కచెల్లెమ్మల సాధికారితలోనూ, అవ్వాతాతల సంక్షేమంలో కనిపించాలి:
సామాజికవర్గాల ఆర్తిని మన ప్రభుత్వం అర్థంచేసుకుని అడుగులు వేస్తోంది:
బీసీలంటే బ్యాక్‌బోన్‌ క్లాస్‌అని గుర్తించిన ప్రభుత్వం, గతానికి, ఇప్పటికీ తేడాను గమనిస్తే ఇట్టే అవగతమవుతోంది:
నవరత్నాలు అమలు మొదలు, డీబీటీ మొదలు, పదవులు, కాంట్రాక్టుల, ఇలా ఏది తీసుకున్నా.. కనిపిస్తుంది:
ఏకంగా చట్టాలు చేసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు మేలు చేశాం:
చంద్రబాబు మాత్రం తనకు కావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడ్ని చూసుకుంటే చాలు.. ఎవరూ చూపరు, రాయరు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా… పట్టించుకోరని భావించాడు:
భరత్‌ను గెలిపించండి…. ఎమ్మెల్సీగా ఉంటూనే కుప్పానికి ఇవన్నీచేశాడు. గెలిపించండి.. మంత్రిగా పంపిస్తాను:

Post midle

Comments are closed.