The South9
The news is by your side.

నీలి చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్!

post top

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ని నిన్న ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పలు యాప్స్ ద్వారా నీలి చిత్రాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపణలు రుజువు కావడంతో నిన్న రాత్రి రాజ్ కుంద్రా ని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. గత ఫిబ్రవరిలో ముంబై శివారు ప్రాంతంలో నీలి చిత్రాల చిత్రీకరణ జరుగుతుందన్న సమాచారం నేపథ్యంలో 12 మందిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించగా రాజ్ కుంద్రా పాత్ర ఉందని కీలక ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టును ముందుగానే ఊహించి రాజ్ కుంద్రా , అరెస్టును ఉద్దేశిస్తూ ….ట్వీట్ చేశారు.

after image

విదేశీ ఐపి అడ్రస్ లతో హాట్ హిట్, న్యూ పిక్స్ , హాట్స్పాట్, అనే పేరు గల యాప్స్ ద్వారా నీలి చిత్రాలను ప్రసారం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో నిర్మాణంలో రాజ్ కుంద్రా వ్యవహరిస్తుండగా దర్శకుడిగా ఉమేష్ కౌశల్ వ్యవహరిస్తున్నారు. గత కొంత కాలంగా ముంబై కేంద్రంగా నడుస్తున్న పోర్న్ మాఫియా మీద పోలీసులు నిఘా పెట్టారు. సినీ రంగం వైపు వస్తున్న కొత్త మోడల్స్ ను అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి బలవంతంగా నీలిచిత్రాలు చేయిస్తున్నారని ,ఈ చిత్ర నిర్మాణ సంస్థ పై మోడల్ సాగరిక ఆరోపించింది. రాజ్ కుంద్రా ని విచారిస్తే పోర్న్ మాఫియా వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాలన్నీ బయటకు వస్తారని అన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.