చెన్నై ప్రతినిధి : ప్రముఖ తమిళ హీరో ఆర్య పై గత కొన్ని రోజుల క్రితం శ్రీలంకకు చెందిన విద్జ అనే యువతి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తను 70 లక్షలు రూపాయలు ఆర్య కి ఇచ్చినట్లు ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రముఖ హీరో అవడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆర్య ను సుమారు ఆరు గంటల పైగా విచారించడం జరిగింది. తర్వాత కూడా పలుమార్లు ఆర్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించడం చేశారు. అయితే ఈ కేసులో హీరో ఆర్య కి ఎటువంటి సంబంధం లేదని తేల్చారు పోలీసులు. క్షుణ్ణంగా దర్యాప్తు జరిగిన తర్వాత చెన్నైలోని పులియంతోప్ కు చెందిన అర్మాన్, హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు ఆర్య పేరుతో సదరు యువతిని మోసం చేశారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో ఆర్య కి ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు పోలీసులు. గత కొన్ని రోజులుగా ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారని , సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని అయినా తనపై నమ్మకంతో అభిమానులు ఎవరు నమ్మ లేదని ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు హీరో ఆర్య.




Comments are closed.