
సినీ బ్యూరో : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. వరుస హిట్లు అయిన పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు సినిమాల కి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందబోతున్న సినిమా ఈ దసరాకి ప్రారంభం కాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. చాలా రోజుల క్రితమే అనిల్ రావిపూడి బాలయ్య బాబు కాంబినేషన్లో సినిమా వస్తుందనీ, కథా చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ దసరాకి ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం 107 సినిమా గా అఖండ అనే చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ఎఫ్2 సీక్వెల్లో బిజీగా ఉన్నారు కామెడీ, హీరోయిజం చూపించడంలో అనిల్ రావిపూడి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి బాలకృష్ణ ని ఎలా చూపించబోతున్నారు అనేది బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య 108 చిత్రంగా ఈ సినిమా రూపొందబోతోంది.



Comments are closed.