The South9
The news is by your side.

వైయస్ జగన్ రియల్ మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్ :రామ్ గోపాల్ వర్మ

post top

ఎప్పుడు ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో ట్విట్టర్లో లో పోస్టింగులు చేస్తూ వివాదాల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. చిత్ర పరిశ్రమలో సినిమా టికెట్ల రేట్లు వ్యవహారం మొదలుకొని మంత్రి పేర్ని నాని తో టీవీ డిబేట్ లో పాల్గొన్న దగ్గర్నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు రాంగోపాల్ వర్మ. ఈ నేపథ్యంలో తెలుగు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, మహేష్, ప్రభాస్ సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీఅయిన సందర్భంగా వారిని ఉద్దేశిస్తూ .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రియల్ మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్ అని, ఈ విషయాన్ని టాలీవుడ్ స్టార్ హీరోలందరూ నిరూపించారని, వర్మ తన ట్విట్ లో తెలియజేశారు. ముఖ్యమంత్రి ముందు వారందరూ కూర్చుని ఉండడం జూనియర్ ఆర్టిస్టులు గా తలపించిందని అన్నారు. స్టార్ హీరోలను జూనియర్ ఆర్టిస్టులతో పోల్చడం పై ఎలాంటి స్పందనలు ఉంటాయో వేచి చూడాలి.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.