The South9
The news is by your side.

రాష్ట్రంలో ఆత్మకూరును మేటిగా నిలబెడతాం సీఎం సభలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

*రాష్ట్రంలో ఆత్మకూరును మేటిగా నిలబెడతాం*

*- సీఎం సభలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*- ఆత్మకూరులో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేయాలి*

*- ఎంజీఆర్ బ్యారేజ్ తో పాటు సోమశిల, ఏఎస్పేటలను పర్యాటక కేంద్రం మంజూరు చేయాలి*

*- పెన్న నదికి పటిష్టంగా పార్లుకట్టలు మంజూరు చేయాలి*

*- ఆత్మకూరు – సోమశీల జాతీయ రహదారిగా మంజూరు చేయాలి.*

 

 

*రాష్ట్రంలోనే ఆత్మకూరు నియోజకవర్గాన్ని మేటిగా నిలబెడతామని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సంగం సీఎం సభలో పేర్కొన్నారు.*

 

Post midle

*కోట్లాది రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతరం బ్యారేజ్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు.*

 

after image

*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తన సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అనూహ్య పరిణామాల్లో తమకు దూరమైనప్పటి నుండి మా కుటుంబానికి అండగా ఉండి నన్ను ఎమ్మెల్యేగా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మేకపాటి కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.*

 

*కోట్లాది రూపాయలతో నిర్మించిన ఎంజీఆర్ బ్యారేజ్ వల్ల ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీంతో అన్నదాతల సీఎం చొరగొన్నారని అన్నారు. ఆత్మకూరు, ఏఎస్ పేట, సోమశిల, ఎంజీఆర్ బ్యారేజ్ లను పర్యాటక వలయంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.*

 

*అలాగే ఎంజీఆర్ బ్యారేజ్ నుండి నేషనల్ హైవేకు అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఆత్మకూరు సోమశిల రోడ్డు జాతీయ రహదారిగా గుర్తించి పనులు మంజూరు చేయాలని కోరారు.*

 

*భారీ వరదల వల్ల పెన్నానదికి ఇరువైపులా ఉన్న గ్రామాలు: ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని. పెన్నాకు ఇరువైపులా పార్లుకట్టలు పటిష్టం చేయాలని కోరారు. సంగం గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

 

*ఆత్మకూరు మున్సిపాలిటిని మరింత అభివృద్ధి చేసే దిశగా పట్టణ సమీపంలోని నారంపేటలో గల పారిశ్రామిక హద్ను తమ సోదరుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంజూరు చేయించారని, కరోనా కష్టకాలంలో ముందుకు సాగలేదని అన్నారు.*

 

*ఆత్మకూరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే సుబిక్షంగా ఉంటుందని అన్నారు. ఆత్మకూరు ప్రాంతవాసులకు 50 శాతం ప్రాధ్యానత ఇచ్చేలా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సీఎంకు వివరించారు.*

 

*2020లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తమ సోదరుడు మంజూరు చేయించారని, దానిపై దృష్టి సారించాలని ఆయన కోరారు.*

 

*రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మొదటి 10 స్థానాల్లో ఆత్మకూరు నియోజకవర్గం ఉండేలా ఆత్మకూరును మేటిగా నిలబెడతామని అన్నారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.