The South9
The news is by your side.

రాజకీయాల్లో పవన్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే: పేర్ని నాని

post top

 

*తేదీ: మార్చి 13, 2023*

తాడేపల్లి

*రాజకీయాల్లో పవన్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే: పేర్ని నాని*

after image

*2024, 2029లోనూ కాపులు జగన్ కే పట్టం కడతారు* 

 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపులు గుండెల్లో పెట్టుకున్నారని మాజీమంత్రి పేర్ని నాని చెప్పారు. 2024, 2029లోనూ కాపులు జగన్ కే పట్టం కడతారని స్పష్టం చేశారు. కాపుల కోసం పవన్‌ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. కులాలపైనా పవన్‌కు కనీస అవగాహన లేదని.. రాజకీయాల్లో ఆస్కార్‌ ఉంటే.. ఏటా పవన్‌కే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. మరో ఏడాదిలో జనసేన అధినేత అన్ని రంగులు బయటపడతాయని అన్నారు.

 

తన కులంవాళ్లు ఓటేస్తే నేను ఓడిపోయేవాడినే కాదని పవన్‌ అంటున్నాడు.. అసలు రాజకీయ నేతకు, ప్రజా నాయకుడికి ఏ కులం అయితే ఏంటని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లు వేస్తే చట్టసభలకు వెళ్లాలని అనుకుంటారా అని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లతో కుల నేత అవుతారు.. ప్రజా నేత కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు బాగుండాలనేదే పవన్‌ కల్యాణ్‌ అంతిమ లక్ష్యమని పేర్ని నాని విమర్శించారు.

 

Post midle

లోపాయికారీ ఒప్పందాలకు పవన్‌ స్పెషలిస్ట్ అని పేర్ని నాని విరుచుకుపడ్డారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పవన్‌ పోటీపడుతున్నాడని దుయ్యబట్టారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకే పవన్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడరని విమర్శించారు. చంద్రబాబు ప్రాపకం కోసం ప్రభుత్వంపై పవన్‌ విషం చిమ్ముతున్నాడు’ అని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.