The South9
The news is by your side.

ప్రజల ముంగిటకే సంక్షేమ పాలన : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

*ప్రజల ముంగిటకే సంక్షేమ పాలన : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: భీమవరంలో గడప గడపకు మన ప్రభుత్వం*

*: బాధిత మహిళకు స్వంత నిధులు అందచేత*

 

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజల ముంగిటకే సంక్షేమ పాలనను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

after image

మర్రిపాడు మండలం భీమవరం గ్రామంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండవ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమ పథకాల లబ్ది కరపత్రాలను అందచేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తమదృష్టికి తీసుకోవాలని వారికి సూచించారు.

 

Post midle

అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు.

 

గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలనలో తేడాలను ప్రజలు గమనించి సంక్షేమ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని కోరారు.

 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే మేకపాటికి ఎగవూరుకు చెందిన కూచి పద్మ కుమార్తె జ్యోష్న మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.50వేలు ఆర్థిక సహాయంగా అందచేశారు. పద్మకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుసుకుని తమ వంతు సహాయం అందచేస్తామని అన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.