నారా రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మనపాటి చక్రవర్తి – South Indian Iconic Awards ఆహ్వానం
విజయవాడ:
6-5-25
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో గుర్తింపు పొందిన ప్రముఖ హీరో నారా రోహిత్ ను నేడు విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసిన South 9 సంస్థ వ్యవస్థాపకుడు మనపాటి చక్రవర్తి, మర్యాదపూర్వకంగా కలిశారు .


విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన నారా రోహిత్‌ను ప్రత్యేకంగా కలిసిన మనపాటి చక్రవర్తి, త్వరలో అమరావతిలో జరగనున్న South Indian Iconic Awards – 2025 కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమం దక్షిణ భారత సినీ, టెలివిజన్, మ్యూజిక్, వెబ్ మీడియా రంగాల్లో ప్రతిభ చూపిన వ్యక్తులను గౌరవించే ఉద్దేశంతో నిర్వహించబడుతోంది. అని తెలియజేశారు.
ఈ ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నారా రోహిత్, “ఇలాంటి వేడుకలు సినీ ప్రముఖులకు ప్రోత్సాహాన్నిస్తాయి. South Indian Iconic Awards విజయవంతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను,” అని తెలిపారు.

ఈ సమావేశంలో నారా రోహిత్ వ్యక్తిగత కార్యదర్శి సాయి, వినోద్ ఫౌండేషన్ సభ్యుడు డానియల్ తదితరులు పాల్గొన్నారు.
South 9 మరియు వినోద్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుక త్వరలోనే సినీ ప్రియుల మనసులను గెలుచుకోవాలని నారా రోహిత్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.



Comments are closed.