
🔥 సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం!
చేవెళ్ల | జూన్ 11: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. నగర శివార్లలోని త్రిపుర రిసార్ట్, చేవెళ్లలో మంగ్లీ బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
పార్టీలో విదేశీ మద్యం సమృద్ధిగా ఉండటంతో పాటు, గంజాయి వాసన గుప్పుమన్నట్టు సమాచారం. దీంతో అనుమానితులకు డ్రగ్స్ టెస్ట్‌లు నిర్వహించగా, పలు మందులకు గంజాయి పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది.

పోలీసుల చర్యలు:
రిసార్ట్‌పై దాడులు చేసి విదేశీ మద్యం సీజ్ చేసిన పోలీసులు
డ్రగ్స్ టెస్ట్‌ల కోసం పలు వ్యక్తులను పీహెచ్‌సీకి తరలింపు

చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
రాజకీయ నేపథ్యం కూడా!?
ఇప్పటివరకు అధికారికంగా మంగ్లీపై ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు లేవు కానీ, ఆమెను గతంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం SVBC సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనకు రాజకీయ రంగు కూడా పులుముకుంటుందా? అనే చర్చలు సాగుతున్నాయి.
Comments are closed.