
*ఘనంగా మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలు*
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఆదివారం మేకపాటి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి చిత్రపటానికి తల్లిదండ్రులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మణిమంజరిలు, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, సోదరులు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఫృద్విరెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి కుటుంబసభ్యులు నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు మేకపాటి గౌతమ్ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుని ప్రతి ఒక్కరి ప్రేమాభిమానులకు పాత్రుడై అందరి మదిలో జ్ఞాపకంగా నిలిచిపోయారని అన్నారు.

గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరుపురాని నేతగా నిలిచిపోయారన్నారు. రాజకీయాల్లో హుందాగా నిలిచారని, రానున్న రోజుల్లో గౌతమ్ రెడ్డి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అభివృద్దికి తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
*నివాళులర్పించిన ప్రముఖులు…*

దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి జయంతి సందర్భంగా నెల్లూరులోని మేకపాటి నివాసంలో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీ, వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కోడవలూరు ధనుంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, పార్లమెంటరీ పరిశీలకులు జంకె వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, పాళెం సుధీర్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మేకపాటి అభిమానులు పాల్గొని గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.



Comments are closed.