
south9 ప్రతినిధి
చెన్నై :
వినోద్ ఫౌండేషన్ మరియు ద సౌత్ 9 మీడియా వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU) రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ మనపాటి చక్రవర్తి ఆదివారం చెన్నైలో ప్రముఖ సినీ నటుడు పృథ్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలను పృథ్వి గారికి వివరించడంతో పాటు, త్వరలో నెల్లూరులో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు.

ఈ భేటీలో పృథ్వి గారు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, రాబోయే సినీ ప్రాజెక్టులపై కూడా ఆసక్తికరంగా చర్చ జరిగింది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి శేఖర్ బాబు, అలాగే వినోద్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అడ్వైజర్ రాజా కూడా పాల్గొన్నారు.


