The South9
The news is by your side.

నెల్లూరులో మెగా ఉచిత వైద్య శిబిరం

post top

🔴 నెల్లూరులో మెగా ఉచిత వైద్య శిబిరం

నెల్లూరు రూరల్, ద డెస్క్:

నెల్లూరు రూరల్ పరిధిలోని దొంతలి గ్రామ గిరిజన కాలనీలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ద సౌత్ 9 మీడియా & వినోద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మనపాటి చక్రవర్తి తెలిపారు. ఈ శిబిరం ఈ నెల 21వ తేదీ (మంగళవారం) ఉదయం 9 గంటలకు ఆదర్శ పాఠశాలలో జరగనుంది.

after image

ఈ వైద్య శిబిరంలో వాసన్ ఐ కేర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, లియో డెంటల్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు నిర్వహించబడనున్నాయి. గిరిజన ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకోవాలని నిర్వాహకులు కోరారు.

గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని వారు తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.