South 9
🔴 నెల్లూరులో మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం
నెల్లూరు రూరల్: ద సౌత్ నైన్ మీడియా & వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దొంతలి గ్రామం గిరిజన కాలనీలో గల ఆదర్శ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతo ;


ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మనపాటి చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వాసన్ ఐ కేర్ ద్వారా కంటి పరీక్షలు, లియో డెంటల్ ద్వారా దంత పరీక్షలు నిర్వహించారు. లియో డెంటల్ వైద్యురాలు డాక్టర్ లహరి పాల్గొని రోగులకు దంత పరీక్షలు చేసి అవసరమైన సూచనలు అందించారు.
గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకుని ఉచిత వైద్య సేవలను పొందారు.


ఈ శిబిరం ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో విజయవంతమయ్యామని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.


