The South9
The news is by your side.

ద సౌత్ 9 కు ‘బెస్ట్ డిజిటల్ మ్యాగజైన్’ అవార్డు.. తల్లిదండ్రులకు అంకితం చేసిన ఎడిటర్ మనపాటి చక్రవర్తి

post top

ద సౌత్ 9కు ‘బెస్ట్ డిజిటల్ మ్యాగజైన్’ అవార్డు.. తల్లిదండ్రులకు అంకితం చేసిన ఎడిటర్ మనపాటి చక్రవర్తి

హైదరాబాద్:

విబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో, విష్ణు బొప్పన నేతృత్వంలో నిర్వహించిన 2026 డిజిటల్ మీడియా అవార్డ్స్ కార్యక్రమం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. సినీ, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను ఈ వేడుకలో అవార్డులతో సత్కరించారు.

కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, సినీ ప్రముఖుడు మాదాల రవి కౌశిక్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా ద సౌత్ 9 ఎడిటర్ మనపాటి చక్రవర్తికి ‘బెస్ట్ డిజిటల్ మ్యాగజైన్’ అవార్డు ప్రదానం చేశారు. అవార్డును అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2002లో సినీ జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని, తనకు తొలి అవకాశం కల్పించిన గురువు సినీ జర్నలిస్ట్ ప్రభుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

after image

2014లో సౌత్ నైన్ మ్యాగజైన్‌ను స్థాపించినట్లు, అనంతరం 2021లో కరోనా సమయంలో డిజిటల్ మీడియా వైపు అడుగులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రింట్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనూ “ద సౌత్ 9″ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

తాను ఎడిటర్‌గా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా కూడా సేవలందిస్తున్నానని, 2015లో వినోద్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Post midle

ఈ సందర్భంగా సినీ జర్నలిస్టుగా అవకాశమిచ్చిన కరవధి సతీష్ సాయికృష్ణ, నెల్లూరులో జర్నలిస్టుగా ప్రోత్సహించిన గాదంశెట్టి శేఖర్ బాబులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తన కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని అందించిన విబి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత విష్ణు బొప్పనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు మనపాటి చక్రవర్తి ప్రకటించారు.

 

ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.