The South9
The news is by your side.

ఏకకాలంలో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్.

post top

 

after image

సౌత్ 9 ప్రతినిధి :

అక్కినేని అఖిల్కుమొదటి చిత్రంతోనే ఎక్కడ లేని ఫాలోయింగ్ వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన యాక్ష‌న్ హీరోగా అంద‌రు ఆయ‌న‌పై బోలెడు న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఒక్క సినిమాలో పూర్తి స్థాయి హీరోగా కనిపించకుండా ఆయన అంత‌టి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. మనం సినిమాలో గెస్ట్ రోల్ ఎప్పుడో బాల నటుడిగా సిసింద్రీ చిత్రాలలో ఆయన నటించారు ఆయన మొదటి చిత్రం అఖిల్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు కానీ వారి ఆశలను అడియాశలు చేస్తూ వినాయక్‌దర్శకత్వంలో వచ్చిన అఖిల్ డిజాస్టర్ అయింది ఆ తర్వాత మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ చిత్రాలు నటించిన ఏది కూడా ఆయనకు కమర్షియల్ హిట్ అందించలేకపోయింది గత సినిమా ఏజెంట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా విడుదలై ఏడాదిన్న‌ర గడుస్తున్నా అఖిల్ త‌న త‌ర్వాతి చిత్రాల‌కు పచ్చ జెండా ఊపలేదు ఎన్నో కథలు వింటున్నాడు కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు తాజాగా ఆయన రెండు చిత్రాలకు పచ్చ జెండా ఊపారు వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రెండు చిత్రాలు ప్రారంభం కానున్నాయి.అందులో ఒకటి యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ధీర ఈ చిత్రానికి అనిల్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు రెండో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సొంత చిత్రంగా ఉండనుంది ఈ చిత్రానికి వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు ఈ రెండు సినిమాలు ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటాయి

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.