
south9 ప్రతినిధి :

కోలీవుడ్ స్టార్ ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటునిగా, నేపథ్యగాయకునిగా పేరు తెచ్చుకున్న ఆయన వై దిస్ కొలవెరి కొలవెరి డి పాటతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. జాతీయ ఉత్తమనటునిగా నిలిచిన ఈయన ఆంగ్ల చిత్రాలలో కూడా నటించాడు. తెలుగులో రఘువరన్ బిటెక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగులో స్ట్రెయిట్‌గా సార్ అనే చిత్రంతో తెరంగేట్రం చేశాడు. ఈయన ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం నవంబర్ 18 2004లో జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. వారి పేర్లు యాత్ర, లింగ. జనవరి 17 2022న ఈ దంపతులు విడిపోతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు. పెళ్లి చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య హాలీవుడ్ షా ధనుష్ రెండేళ్ల క్రితం విడిపోతున్నట్టు ప్రకటించారు 2022 నుంచి ఈ జంట విడివిడిగా ఉంటుంది అయితే పిల్లల బాధ్యతలు మాత్రం ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు అయితే వీరి జీవితంలో తాజా పరిణామం చోటుచేసుకుంది ధనుష్ ఐశ్వర్య కలిసి ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం రజనీకాంత్ ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు బాగోగుల రీత్యా ధనుష్ ఐశ్వర్య కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇదే నిజమైతే బాగుంటుందని వారి అభిమానులు కోరుకుంటున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది
Comments are closed.