The South9
The news is by your side.

బాలయ్య బాబు మీ బావ చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు: లక్ష్మీపార్వతి

  • చంద్రబాబు దుర్మార్గమైన వ్యక్తి
  •  వైయస్సార్ సిపి ఎమ్మెల్యేలు అలా అని ఉంటే నేను ఊరుకోను
  •  భువనేశ్వరి నా బిడ్డ
  • ఆయన ట్రాప్ లో పడవద్దు                                                                                                                                                    నిన్నజరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీరు పెట్టిన సంఘటనపై ఈరోజు నందమూరి కుటుంబ సభ్యులు, హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిస్పందనగా వైఎస్సార్సీపీ నేత ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.                                                                                                                                                                                                                                                                     లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ….‌ నిజంగా భువనేశ్వరిని వైయస్సార్ సిపి ఎమ్మెల్యేలు తిట్టి ఉంటే ఉపేక్షించేది లేదని, దానికి నేను కూడా అ ఒప్పుకోనని, అవసరమైతే ముఖ్యమంత్రి కి లెటర్ రాసి అడుగుతానని అన్నారు. కానీ ఆ విధంగా జరగలేదని ఇదంతా చంద్రబాబు దుష్ప్రచారం అని అన్నారు. భువనేశ్వరి నాకు కూతురు లాంటిదని అలాంటి నా బిడ్డని అలా అంటే మేమెందుకు గమ్ముగా ఉంటామని అన్నారు. బాలకృష్ణ ను ఉద్దేశించి మాట్లాడుతూ మీ నాన్న ను వెన్నుపోటు పొడిచి మీ అందరిని నాకు దూరం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     మీ బావ గురించి నీకు తెలియదా ఆయన వాళ్ళ నాన్నకి ఎప్పుడైనా ఒక ముద్ద అన్నం పెట్టాడా అని, అతనికి బంధాలు బంధుత్వాలు ఇటువంటి ఫీలింగ్స్ ఉండవని అన్నారు. వైయస్ జగన్ ని జైల్లో పెట్టినప్పుడు వారి కుటుంబ సభ్యులు అయిన విజయమ్మ ,భారతి, షర్మిల , రోడ్డు మీద కూర్చుని నిరసన చేస్తుంటే మీ బావ చంద్రబాబు ఏ విధంగా వారిపై ప్రచారం చేశాడో నా నోటితో నేను అనలేనని అన్నారు. వైయస్ఆర్ కుటుంబం గురించి చెప్ప వలసి వస్తే.. నిన్ను రెండు కేసులు నుంచి కాపాడిన గొప్ప కుటుంబం అని బాలయ్య బాబు ను ఉద్దేశించి మాట్లాడారు. అలానే భువనేశ్వరికి కూడా మీ ఆయన చంద్రబాబు మాటలు నమ్మవద్దని నిన్ను ఎవరు అలా దూషించలేదు అని తెలియజేశారు చంద్రబాబు భయంకరమైన వ్యక్తి అని ఆయన ట్రాప్ లో పడవద్దని నందమూరి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు లక్ష్మీపార్వతి.
Post midle

Leave A Reply

Your email address will not be published.