The South9
The news is by your side.
after image

రాష్ట్రంలో బ్రోకర్‌ ‘బాబు’.. జోకర్‌ ‘లోకేశ్‌’ డ్రామాలు మంత్రి జోగి రమేశ్‌.

post top

 

*17.02.2023.*

*తాడేపల్లి.*

*రాష్ట్రంలో బ్రోకర్‌ ‘బాబు’.. జోకర్‌ ‘లోకేశ్‌’ డ్రామాలు..*

*సీఎం జగన్ పై నోరు పారేసుకుంటే బడిత పూజ*

*లోకేశ్‌ది పాదయాత్ర కాదు. ఫన్నీ యాత్ర*

*చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ప్రభుత్వంపై పిచ్చి విమర్శలు*

Post midle

*మీడియా సమావేశంలో మంత్రి జోగి రమేశ్‌*

 

రాజకీయాల్లో చంద్రబాబు ఒక బ్రోకర్‌ అవతారంలో ఉంటే, ఆయన కొడుకు లోకేశ్‌ మాత్రం రాజకీయ జోకర్‌గా మిగిలాడని. రాష్ట్రంలో టీడీపీ బ్రోకర్ బాబు.. జోకర్ లోకేష్ డ్రామాలు నడుస్తున్నాయని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ‘ఎన్నికలు వచ్చేసరికి పొత్తుల బేరం కోసం బ్రోకరిజం నడిపే చంద్రబాబు. మరోవైపు తన ఉత్తపుత్రుడు లోకేశ్‌ను పాదయాత్రకు ఉసిగొల్పాడు. రాష్ట్ర రాజకీయాల పట్ల కనీస అవగాహన లేని లోకేశ్‌.. తన తండ్రి మాట విని పాదయాత్ర పేరిట ఫన్నీయాత్ర చేస్తున్నాడు. వంకర టింకర నడకతో రోడ్ల పక్కన పునుగులు, బజ్జీలు తింటూ.. సెల్ఫీలు దిగడాన్ని పాదయాత్ర అని ఎవరైనా అంటారా..? అసలు, పాదయాత్ర చేసే అర్హత లోకేశ్‌కు ఉందా..? పోనీ, అతని దరిద్రానికి అతను ఎలా నడిచినా.. కనీసం, ప్రజల ముందు మాట్లాడే భాష సక్రమంగా ఉండాలి కదా.. ఐదు కోట్ల ప్రజల ఆదరణ పొందిన సీఎం జగన్‌ను ఇష్టానుసారంగా బూతులు తిడతాడా..? అందుకే చంద్రబాబుకు, లోకేశ్‌కు జనం బడిత పూజ చేసే సమయం వచ్చింది.’ అని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ పేర్కొన్నారు.

 

రాజకీయాల్లో పిల్లకుంక లోకేశ్‌:

 

‘ఓయ్‌ లోకేశ్‌.. నువ్వు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని పిల్లకుంకవి. నీ తండ్రి చంద్రబాబు దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చాడు. నీ తాత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు’.. ఈ సంగతి తెలిసి లోకేశ్‌ కూడా దొడ్డిదారిన రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నాడేమో.. నేటి రోజుల్లో అది జరగని పనిగా లోకేశ్‌ గుర్తించాలి. ‘నువ్వు.. మా ముఖ్యమంత్రిని భయపెడతావా..? నీ తొత్తుగాళ్ల ముందు మైకు పట్టుకుని దీర్ఘాలు తీస్తూ మాట్లాడినంత తేలిక కాదు.. మా నాయకుడ్ని భయపెట్టడమంటే’.. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తిరిగి మా నాయకుడు జగన్‌గారి గురించి ఒక్క మాట అడుగు. ధీరుడు, ధీశాలి, దమ్మున్న మొనగాడంటే ఎలా ఉంటాడో.. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మా సీఎం అని ప్రతి ఒక్కరూ చెబుతారు.

 

పాదయాత్రలకు డబ్బుంటే సరిపోదు

 

Post Inner vinod found

‘లోకేశ్‌.. నీది ఒక పాదయాత్రనా?. నువ్వొక లీడర్‌వా?. నీకొక పెద్ద ప్రచారమా?. రాజకీయాల్లో డబ్బుంటేనే సరిపోదు.. దమ్మూౖ ధెర్యం ఉండాలి. కలేజా ఉన్న మొనగాడు మా సీఎం. అలాంటి నాయకుడి ముందు మీలాంటోళ్ల కుప్పిగంతులు పనికి రావు. నక్కజిత్తుల నారా చంద్రబాబు కొడుకుగా లోకేశ్‌ పాదయాత్రలో మాట్లాడే విషయాలపై జనం నవ్వుకుంటున్నారు. నోరు తిరగని తెలుగు పదాలతో పాట్లు పడటం తప్ప లోకేశ్‌ పస లేని ప్రసంగాలు ప్రజలకు అర్ధం కావడం లేదు. అతనికి, అతని తండ్రి చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క స్కీం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అన్నింటిలోనూ స్కామ్‌లు చేసిన బాబుకు ఇప్పటికే పెద్ద సైకో అని పేరుంది. అందుకే, ప్రజలెవరూ వారిని నమ్మకపోవడంతో ప్రస్టేషన్‌లో ఉన్నారు.

 

వార్డు మెంబెర్ గా గెలవలేని లోకేష్ రాజకీయ నాయకుడా?

 

రాజకీయాల్లో బుడిబుడి అడుగులు వేస్తున్న లోకేశ్‌.. బాబు బాటలో నడుస్తూ తప్పటడగులు వేస్తున్నాడు. కనీసం వార్డు మెంబర్‌గా గెలవనోడు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేనోడు ఈ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడతాడా? ఈరోజు అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చూస్తుంటే.. బాబుకు, లోకేశ్‌కు మాత్రం పిచ్చి పట్టింది.

శివరాత్రి పర్వదినానికి శివుడ్ని దర్శించుకోవడానికి భక్తులు లక్షలాదిగా శ్రీకాళహస్తికి వస్తుంటే.. లోకేశ్‌ కూడా శ్రీకాళహస్తి వెళ్తాడంట.. పైగా, పోలీసులు తనకు అనుమతి ఇవ్వలేదని హడావిడి చేస్తున్నాడు. పండగ పూట కూడా పాత రాజకీయాలేంటి లోకేశ్‌. సమయం, సందర్భం లేకుండా జనాలు ఎక్కడుంటే.. అక్కడ సభలు పెట్టడానికి తండ్రీ కొడుకులు సిద్ధంగా ఉంటారా..? మీ రాజకీయ దాహానికి జనాల్ని ఇబ్బందులు పెట్టడం సరి కాదని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.

 

వీధిరౌడీల్లా టీడీపీ నేతలు:

 

చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని లోకేశ్‌తో పాటు అచ్చిగాడు, బుచ్చిగాడు, పంది పట్టాభిగాడు వంటి లోఫర్‌గాళ్లు రోడ్లపైకి వచ్చి వీధి రౌడీల్లా జనాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన ముసలోడివి. ఇదేనా నీ తీరు? ప్రభుత్వం మీద, సీఎంగారిపైనా నోరు పారేసుకునే చెత్త చంద్రబాబుకు, జోకర్‌ లోకేశ్‌కు, ఇతర నేతలకు జనం చేతుల్లో బడితె పూజ ఖాయం.

 

లోకేష్ ది పాదయాత్ర కాదు.. జోకర్ యాత్ర:

జననేత, మనసున్న నేత మా జగనన్న చేసింది సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్ర. అది చరిత్రపుటలో లిఖించిదగ్గ పాదయాత్ర. అలాంటి ప్రజల మనసును గెలుచుకున్న నేతల పాదయాత్రలతో నీ ఊరేగింపును పోల్చుకుంటావా లోకేశ్‌?. నీ వంటి జుట్టు పోలుగాళ్ల ఊరేగింపును పాదయాత్ర అనరు.

ఈరోజు రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీలు నవరత్నాల సంక్షేమ పథకాలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మా ప్రభుత్వమని, తమ నాయకుడు జగన్‌ అని అన్ని వర్గాలవారు గర్వంగా చెబుతున్నారు. అందుకే యాత్రల పేరుతో ప్రజల్లో భ్రమలు కలిగించాలనే వృథా ప్రయత్నాలు ఇకనైనా మానుకుంటే మంచిది.

 

మీ దోపిడీని మరిచిపోలేరు:

 

ఈరోజు రాష్ట్రంలో పేద, మధ్య, ఉన్నత తరగతి వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో వలంటీర్, సచివాలయ వ్యవస్థలు చాలా కీలకంగా పని చేస్తున్నాయి. ప్రతీ 50 ఇళ్లకు వలంటీర్‌ను నియమించి, సంక్షేమ పథకాలను అందిస్తూ ఆయా కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మూడున్నరేళ్లల్లో రూ.2 లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా అందించిన ప్రభుత్వంగా మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇంత మంచి పనులు చేస్తున్న వ్యవస్థల్ని చంద్రబాబు, లోకేశ్‌లాంటి సన్నాసులు విమర్శిస్తూ.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఇప్పుడు వాళ్ల పార్టీ తరఫున ఇంటింటికి సారథులను పంపుతారట. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరిట రాష్ట్రంలో జరిగిన దోపిడీని జనాలు మరిచిపోలేరు కదా.. కనుక, టీడీపీ సారథుల్ని కనీసం జనం ఇళ్ల ముంగిటకు కూడా రానివ్వరు.

 

టీడీపీ శవయాత్రకు ముహూర్తం:

 

చంద్రబాబు, లోకేశ్‌లు కలిసి ఎంత మంది కాళ్లు పట్టుకుని బతిమిలాడి తెచ్చుకున్నా.. 2024 ఎన్నికల్లో మా దమ్మున్న నాయకుడు జగన్‌గారిని ఢీకొట్టలేరు. సింగిల్‌ ఉన్న జగనన్నను నేరుగా ఎదుర్కోలేక కుప్పలుగా పొత్తులకు వెంపర్లాడుతున్నారు. మీరెంత మంది కలిసొచ్చినా వైఎస్‌ఆర్‌సీపీ కంచుకోటను ఇంచ్‌ కూడా కదిలించ లేరు. అందుకే చంద్రబాబు, లోకేశ్‌ చేసే యాత్రలు టీడీపీ శవయాత్ర కోసం ముహూర్తం పెట్టడానికే అని చెప్పుకోవచ్చు. 2024 తర్వాత టీడీపీ వల్లకాటికే అనేది అందరికీ తెలిసిపోయిందని మంత్రి జోగి రమేశ్‌ చెప్పారు.

Post midle

Comments are closed.