The South9
The news is by your side.

ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వర పై కేసు నమోదు.

post top

న్యూఢిల్లీ:                                                    ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్ భారతదేశ యం. డి మనీష్ మహేశ్వరి పై కేసు నమోదు అయ్యింది. గత కొన్ని రోజులుగా కేంద్రం వెర్సెస్ ట్విట్టర్ అన్నట్టు సాగుతున్న వ్యవహారంలో ఈ కేసు నమోదు అవ్వడం తో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో మత ఘర్షణల లో భాగంగా ఒక ముస్లిం వృద్ధుడిపై దాడి జరిగిన ఉన్న వీడియోని ట్విట్టర్ లో షేర్ అయినా సందర్భంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఈ కేసు తో పాటు బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పైన కూడా కేసు నమోదైనట్లు ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఒక ముస్లిం వ్యక్తిని గడ్డం తొలగించి అతనితో జైశ్రీరామ్ అనే నినాదం అనిపించిన వీడియో వివాదాస్పదం అవ్వడంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.                                                                                                                   వార్త వెబ్ సైట్స్, పాత్రికేయులపై మోపిన నేరారోపణల వెంటనే ఉపసంహరించుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. వార్త ని రిపోర్ట్ చేసి నేరాలు మోపడం, స్వతంత్ర మీడియా ని వేధించాడని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.