The South9
The news is by your side.

చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు: వైయస్ జగన్

after image

 

*తేదీ: 23 -11 -2022*

శ్రీకాకుళం

*మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే.. నాకు మద్దతివ్వండి*

*చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు*

*రాజకీయమంటే ఒక జవాబుదారీతనం, మోసం చేసే చంద్రబాబు కి గుడ్ బై చెప్పండి: సీఎం జగన్*

Post Inner vinod found

ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్‌, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతందిని సీఎం జగన్‌ తెలిపారు.

Post midle

తాను చేసిన ప్రభుత్వ సంస్కరణలను వివరిస్తూ సీఎం జగన్ ప్రజలను మోసగాళ్ల మాట నమ్మద్దని కోరారు. తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జగన్‌ అంటారని. తెలుగు దేశం పార్టీ ని కబ్జా చేసిన చంద్రబాబుని ఓ కబ్జాదారుడు అంటరాని వివరించారు. సొంత పార్టీ తో అధికారం లోకి వస్తే రాముడు అంటారని, మామ పార్టీ లాగి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ని రావణుడు అంటారు అని సీఎం జగన్ హెద్దేవా చేసారు. అలాంటి చంద్రబాబుకు తన దుష్టచతుష్టయాన్ని 2024 లో ‘బాయ్ బాయ్’ చెప్పాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పై జరిగే దృష్ప్రచారాన్ని నామొద్దు అని వచ్చే ఎన్నికల్లో మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే.. నాకు మద్దతివ్వండి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

నరసాపురం లో రెండు లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్డు విస్తరణకు మంత్రి ధర్మాన కోరిక మేరకు సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తునట్టు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ రోగుల కు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడించారు. వంశధార ప్రాజెక్టు అడ్డంకులు అధిగమిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఒడిస్సా సీఎంతో మాట్లాడినట్లు తెలిపారు.

*దేశం లోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో భూ సర్వే*
10,185 గ్రామ సర్వేయర్లు, 3,664 వార్డు ప్లానింగ్ సెక్రటరీల, రూ. 1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2,000 రోవర్ల ద్వారా అత్యాధునిక సాంకేతికలతో రీసర్వే చేయబడుతుంది. ప్రతి భూకమతాన్ని సర్వే చేసి అత్యంత ఖచ్చితత్వంతో అక్షాంశ, రేఖాంశాలు, గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు QR కోడ్తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ చేయబడుతుంది. ప్రతి స్థిరాస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత ఇవ్వబడుతుంది.

*ప్రజల వద్దకే పాలనా*
జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల సంఖ్య కేవలం 295, మండల సర్వేయర్ల సంఖ్య కేవలం 676.. సర్వే, మ్యూటేషన్, ఇతరత్రా రిజిస్ట్రేషన్ సేవల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి, లంచాలు, వివక్ష. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి తయారు చేసిన (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటు లోకి తెచ్చింది. టాంపరింగ్ కు ఏమాత్రం అవకాశం లేకుండా డిజిటల్ పద్ధతిలో భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే భద్రం చేయబడుతుంది. ఇకపై గ్రామా సర్వేయర్ల ద్వారా 15 రోజుల్లో ఫీల్డ్ లైన్ దరఖాస్తు జరగనుంది అలనే 30 రోజుల్లో పట్టా సుబ డివిజన్ దరఖాస్తులు పరిష్కారం కి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక పై శాశ్వత భూహక్కు మరియు భూరక్ష క్రింద అందించే భూ సంబంధిత సేవలన్నీ గ్రామ సచివాలయాల్లో సింగిల్ డెస్క్ ద్వారా అందజేయబడుతుంది.

ఈ స్థాయి పథకాన్ని ప్రత్యేక శ్రద్ద తో పర్యవేక్షిస్తున్న ఏకైక రాష్ట్రం ఇదే అని సీఎం జగన్ ని సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్వీ సింగ్ ప్రశంసించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పల్రాజు తదితర స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Post midle

Leave A Reply

Your email address will not be published.