The South9
The news is by your side.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో రెండు వందల నలభై ఒక్క కోట్ల గోల్మాల్ పై సిఐడి ముమ్మర దర్యాప్తు.

post top
  • మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు
  • ప్రత్యక్షమైన ఏబీఎన్ రాధాకృష్ణ 
  • తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయని దీనికి సంబంధించిన వ్యవహారంలో భారీగా నిధులు షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని సిఐడి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు కు సంబంధించి అప్పటి ఏ పి ఎస్ ఎస్ డి సి ఎండి గంటా సుబ్బారావు, డైరెక్టర్ గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ కే లక్ష్మీనారాయణ తదితర అధికారులపై కేసు నమోదు చేయడం జరిగింది. వీరితోపాటు సీమెన్స్ డిజైన్ టెక్ , కంపెనీలకు సంబంధించిన 26 మందిపై సి ఐ డి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా శుక్రవారం నాడు హైదరాబాదులోని మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. సిఐడి అధికారులును అడ్డుకోవడానికి ప్రయత్నించారని ప్రచారం జరిగిన ,మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ రాధాకృష్ణకి సన్నిహితుడని విషయం తెలుసుకున్న తర్వాత మామూలుగా అక్కడికి వెళ్ళాడని అంటున్నారు. అధికారులు దర్యాప్తు చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటని మరొకరు ప్రశ్నిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తోపాటు టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అక్కడికి వెళ్లడంతో రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుదేశం నాయకుల ప్రమేయం లేకుండా ఇది జరగలేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.