The South9
The news is by your side.

ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు.. కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించిన సీఎం జగన్‌

post top

ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు.. కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించిన సీఎం జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ రెండు కీలక తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది..

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

after image

బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని ఒక తీర్మానం. అలాగే.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేసింది ఏపీ అసెంబ్లీ. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్‌.

 

 

పాదయాత్రలో.. ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేశాం. రాయలసీమ జిల్లాల్లో ఆ కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్‌ తెలుసుకుంది. ప్రభుత్వానికి నివేదిక అందించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీర్మానం చేశాం అని సీఎం జగన్‌ తెలిపారు.

 

ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వారిని నేను కూడా అలాగే గుండెల్లో పెట్టుకుంటా. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండబోదని, గిట్టని వారే ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారాయన.

 

అలాగే.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని.. ఉమ్మడి ఏపీలో దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలో తీర్మానం జరిగింది. మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం. మతం మారినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారవు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.