The South9
The news is by your side.

ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ*

post top

తేదీ: 29-05-2023*

*స్థలం: ఢీల్లీ*

*ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ*

 

*తెలుగు రాష్ట్రాల మధ్య విభ­జన సమస్యలు వెంటనే పరిష్కరించండి: సీఎం జగన్‌*

 

after image

సీఎం మూడు రోజుల జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. తాజాగా ఆయన హోం మంత్రి అమిత్ షా తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా విభజన చట్టం హామీల అమలుకోసం మరోసారి జగన్ పట్టుబట్టారు.

 

 

*తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని పలు అంశాలపై చర్చ*

 

ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో జగన్ భేటీ అయ్యారు. 40నిమిషాల సేపు ఈ సుదీర్ఘ భేటీ జరిగింది. పోలవరం ప్రాజె­క్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపేలా చూడాలని కోరారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య అపరి­ష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్క­రించాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఏపీ భవన్‌ సహా షెడ్యూల్‌ 9, 10 ఆస్తుల విభజ­నపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభు­త్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకా­యిల అంశాన్నీ హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీ విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరి­గణనలోకి తీసుకుని, వెంటనే ఈ బకా­యిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Post midle

అంతకు ముందు రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులు సహా పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని సీఎం కోరారు. సుమారు అరగంటపాటు సమావేశం కొనసాగగా.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.