సౌత్ 9 ప్రతినిధి
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మరో వివాదానికి తెర లేపుతూ బిజెపిని కుక్కతో పోల్చారు అకోలా లో ఎన్నికలు ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో మహా వికాస్ అగాడి ప్రభుత్వాన్ని పడగొట్టిన బిజెపిని లక్ష్యంగా చేసుకొని మాటల దాడి చేశారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పట్నవిస్ తనను తాను దేవుడిగా భ్రమ పడుతున్నారని విమర్శించారు ఓబీసీ కమ్యూనిటీ పై బిజెపికి ఏమాత్రం గౌరవం లేదు అన్న ఆయన మిమ్మల్ని కుక్కలు అంటున్న బిజెపికి అకోలా జిల్లాలోని ఓబీసీ లో ఓటేస్తారా అని ప్రశ్నించారు బిజెపిని ఇప్పుడు కుక్కలా మార్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు మహారాష్ట్ర నుంచి బిజెపిని పారదోలే సమయం ఆసన్నమైంది అన్న నానా పటోరె పలు అబద్ధాలతో బిజెపి అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు దాని స్థానం ఏంటో చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు బిజెపి నేతలు తమను తాము దేవుడిగా విశ్వగురుగా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు నానా పతోడే వ్యాఖ్యలపై బీజేపీ నేత మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య తీవ్రంగా స్పందించారు ఓటమితో నిరాశలో ఉన్న కాంగ్రెస్ నేతలు బిజెపి వారిని కుక్కలుగా పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈనెల 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి అధికార మహా యూటీ ప్రతిపక్ష మహా వికాసగాడి కూటమి మధ్య హోరాహోరీ పోటీ తప్పేలా కనిపించడం లేదు
Comments are closed.