The South9
The news is by your side.

గ్యాంగ్ స్టర్ గా ధనుష్

కోలీవుడ్ స్టార్స్ ఎప్పుడు కొత్తరకం కథల కోసం అన్వేషిస్తుంటారు. పాత్ర నచ్చితే వారి ఇమేజ్ ను పక్కన పెట్టి ఏ పాత్ర చేసే దానికైనా వెనకాడరు. అటువంటి హీరోల లో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ ప్రత్యేకమని చెప్పుకోవాలి. హీరోగానే నటిస్తూ తనకు నచ్చిన కథలతో నిర్మాణ రంగం వైపు కూడా ఉంటూ ముందుకు వెళుతున్నాడు ధనుష్. ఈ నేపథ్యంలో దనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న సినిమా జగమే త0ద్రియం. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లో రిలీజ్ చేయలేరు కాబట్టి నెట్ ఫ్లెక్స్ లో ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు . దీనికి సంబంధించిన ట్రైలర్ ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. మామూలుగా తమిళ చిత్ర పరిశ్రమలో అధికభాగం సినిమాలు తమ నేటివిటీకి అనుగుణంగా చిత్రీకరించి కుంటారు. అయితే గ్యాంగ్ స్టార్ నేపథ్యమున్న ఈ కథని హాలీవుడ్ తరహాలో తెరకెక్కించడం విశేషం. ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఒక పాన్ ఇండియా మూవీ కి సరిపోయే మెటీరియల్ ఈ చిత్రంలో కనపడుతుంది అంటే అతిశయోక్తి కాదు.

Post Inner

Post midle

Leave A Reply

Your email address will not be published.