(తిరుపతి ఇంచార్జ్ విజయ్) తిరుపతి ఆటో నగర్ ప్రాంతం లోని టీడీపి కార్యాలయం ప్రారంభించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయాడు మీడియా తో మాట్లాడుతూ..రాష్ట డీజీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సవాంగ్ ఏ రాష్ట్రంలో ఉన్న ఏ కలుగులో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. డీజీపీ కి తెలువి మెదడు లో లేదని మోకాళ్లు లో ఉందని ఎద్దేవాచేశారు. చీము, నెత్తురు ఉంటే ఆలయాలు పై టీడీపీ వాళ్లే దాడి చేసారని నిరూపించాలి అని అన్నారు.అలానే రాష్ట్రంలో పోలీస్ నుంచి డీజీపీ వరకు ఏక పక్షంగా వ్యవహరించిన ఏ ఒక్కరని వదలం అని అన్నారు. చిత్ర గుప్తని చిట్టాలా అందరి పేర్లు రాసుకుంటామని, కొందరు అధికారులు రిటైడ్ అవ్వ గానే వేరే ప్రాంతానికి వెళ్లిపోతామని ధీమా లో ఉన్నారని ,అలా ఉన్నా వారి ఇంటికి వెళ్లి పని పడతామని హెచ్చరించారు. అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ లో హిందు పరిరక్షణ ప్రచార సభ నిర్వహించి తీరుతామని అచ్చన్నాయాడు అన్నారు.
Comments are closed.