The South9
The news is by your side.
after image

రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ లుక్ వెనుక ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్!

post top

*రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ లుక్ వెనుక ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్!*

 

క్యారెక్టర్‌కు తగ్గట్టు లుక్ చేంజ్ చేసే యువ కథానాయకులలో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకరు. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం స్టైలిష్ లుక్‌లోకి ఆయన వచ్చేశారు. ఈ లుక్ వెనుక ఫేమస్ ముంబై హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారండోయ్!

 

బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ బోయపాటి శ్రీనుతో రామ్ చేస్తున్న సినిమా ‘స్కంద’. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే… రామ్ మాసీ అవతార్‌లో కనిపించారు. ఆ సినిమా కోసం వెయిట్ పెరిగారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించారు. ఆ సినిమా షూటింగ్ ముగిసింది. ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ స్టార్ట్ చేశారు. ఈ సినిమా కోసమే ఈ లుక్. ఈ రోజు మేకోవర్ వీడియో విడుదల చేశారు.

 

Post Inner vinod found

‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రామ్ లుక్ చేంజ్ చేశారు. పొడవాటి జుట్టు తీసేసి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశారు. ఈ లుక్ వెనుక ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీమ్ ఉన్నారు. రామ్ హెయిర్ స్టైల్‌ను ఆయనే డిజైన్ చేశారు. న్యూ హెయిర్ స్టైల్‌లో రామ్ లుక్ సూపర్ ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

 

టాలీవుడ్ యంగ్ స్టార్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితర హీరోలకు సైతం ఆలిం హకీమ్ స్టైలింగ్ చేశారు. ‘డబుల్ ఇస్మార్ట్’ కంటే ముందు కూడా రామ్ పోతినేనితో ఆలిం హకీమ్ వర్క్ చేశారు.

Post midle

Comments are closed.