
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూటినీ, ఉపసంహరణ అనంతరం 1,121 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు అధికారులు తెలిపారు.

అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దాదాపుగా మొత్తం 150 డివిజన్లలోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. టీడీపీ నుంచి 105 మంది, ఎంఐఎం నుంచి 50 మంది పోటీలో ఉండగా, ఇతర పార్టీలు, స్వతంత్రులు 500 మందికిపైగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Tags: GHMC Elections, Hyderabad, TRS Congress, BJP TDP

Comments are closed.