
*10-01-2023*
*తాడేపల్లి*
*ప్రజా భద్రత కోసమే జీవో నంబర్ 1; అదనపు డీజీపీ*
*రోడ్ షోలు, సభలపై నిషేధమని జీవోలో ఎక్కడా లేదు.*

*జీవో నంబర్ 1పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.*
*ప్రజలకు అంతరాయం కలిగించకూడదని మాత్రమే జీవోలో ఉంది.*

*కుప్పం పర్యటనకు సరైన పత్రాలివ్వని టీడీపీ నాయకులు*
రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1 ద్వారా రోడ్ షోలు బ్యాన్ చేసిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. “కొన్ని రోజుల క్రితం కుప్పంలో చంద్రబాబు పర్యటనకు సంభందించి టీడీపీ నాయకులు అనుమతికి కావలిసిన సరైన డాక్యుమెంట్లను పోలీసు శాఖకు అందించలేదు. పూర్తి స్థాయిలో సరైన వివరాలతో కూడిన డాక్యుమెంట్లను ఇవ్వవసిందిగా పోలీసుశాఖ కోరగా టీడీపీ నాయకులు పోలీసుశాఖ నుండి డాక్యుమెంట్లను తీసుకుని వెళ్లి తిరిగి రాలేదు. జీవో నంబర్ 1 అనేది ఒక మంచి ఉద్దేశం కోసం ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా హైవేలు, సన్నని రహదారులపై సభలు నిర్వహించకూడదని మాత్రమే జీవో నంబర్ 1 చెబుతోంది. అంతేకానీ, రోడ్ షోలు, బహిరంగ సభలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఎక్కడా జీవోలో పేర్కొనలేదు. పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకానీ, రోడ్ షోలపై ఎలాంటి నిషేధం విధించలేదు. అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందులు కలగకూడదనేదే మా ఉద్దేశం. ప్రస్తుతం ఈ చట్టం దేశ వ్యాప్తంగా అమలవుతున్నదే. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా అధికారులను కోరితే వారు స్థలాన్ని పరిశీలించి అనుమతులు ఇస్తారు.” అని రవిశంకర్ వెల్లడించారు.
అదేవిధంగా శాంతి భద్రతల డీఐజీ రాజశేఖర్ మాట్లాడుతూ.. “కందుకూరు వంటి ఘటనలను ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ జీవో జారీ చేయడం జరిగింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై అంతరాయం కలిగించినపుడు ఇబ్బందులు ఏర్పడతాయి. పబ్లిక్ గ్రౌండ్లలో సభలు జరుపుకోవాలని జీవోలో ఉంది. అంతేకాకుండా, మీటింగులు జరిగే దగ్గర కరెంటు వైర్లు, డ్రైనేజీలు లేకుండా చూడాలి.” ఆయన స్పష్టం చేశారు.
Comments are closed.