The South9
The news is by your side.
after image

రైతులకు శుభవార్త.. వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన జగన్

post top

 

*తేది: 07-11-2023*
*స్థలం: పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా*

*రైతులకు శుభవార్త.. వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన జగన్*

*ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం*

*పంట సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం.. గడిచిన 4 ఏళ్లలో రూ.60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం*

రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందనేది ప్రతి రైతన్నా ఆలోచించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైయస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కింద వరుసగా ఐదో ఏడాది 2వ విడత పెట్టుబడి సాయాన్ని అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ రైమాట్లాడుతూ… రాష్ట్రంలోని 53.53 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా దాదాపు రూ.2,200 కోట్లు జమ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఈరోజు రేపటి లోపు మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లు నేరుగా ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇక పీఎం కిసాన్ కింద రావాల్సిన రూ.1,000 కోట్లు వాళ్లు ఇచ్చిన వెంటనే ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు.

*రైతు ప్రభుత్వం మనది..*

Post midle
Post Inner vinod found

ఈ 53 నెలల్లోనే రైతుకు, రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతిచ్చిందో అందరికీ తెలిసిందేనని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన పనులను చేయలేకపోయాడో ఆలోచన చేయాలన్నారు. ఈ 53 నెలల కాలంలో 53 లక్షల పైచిలుకు రైతన్నలకు మంచి జరిగిస్తూ, ప్రతి రైతన్నకు నేరుగా బటన్ నొక్కి ఖాతాల్లోకి జమచేయడం వల్ల ఒక్కొక్కరికి దాదాపు రూ.65,500 ఇవ్వడం జరిగిందన్నారు. అయిదో విడత కింద రూ. 4వేలను ఒక్కో రైతు ఖాతాల్లో జమచేసేందుకు రూ.2,200 కోట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కేంద్రంతో సంప్రదించి రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరతానని సీఎం జగన్‌ తెలిపారు. కేవలం రైతు భరోసా పథకం ద్వారానే దాదాపు 53 లక్షల పైచిలుకు రైతులకు రూ.33,209 కోట్లు ఆ అయిదేళ్లలో వారి ఖాతాల్లోకి నేరుగా పంపగలిగామన్నారు.

*నిరుపేదలకు మంచి చేశాం కాబట్టే .. ప్రజలు వారి గుండెల్లో పెట్టుకున్నారు*

గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు స్పందన బాగుందని సీఎం జగన్‌ తెలిపారు. రైతులుగానీ, అవ్వాతాతలుగానీ, అక్కచెల్లెమ్మలుగానీ, చదువుకొనే పిల్లలు గానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ నా నిరుపేద వర్గాలు గానీ, ఈ వర్గాలకు మంచి చేస్తే, ఇచ్చిన ప్రతిమాటా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లో స్థానం ఇస్తారని చెప్పడానికి ఒక వైయస్సార్ గారిని చూసినా ఒక జగన్ ను చూసినా అర్థం అవుతుందన్నారు. ఇదే విషయం సామాజిక సాధికార యాత్రలను చూసినా కనిపిస్తోందన్నారు. నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనార్టీలను నాయకత్వ రోల్ లోకి తీసుకొచ్చి వాళ్ల చేత మీటింగులు పెట్టిస్తున్నా తండోపతండాలుగా జనాలు కదిలి వస్తున్నారంటే ఎంతగా ప్రతి పేద వాడి గుండెల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానం ఉందో నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. మీ బిడ్డ జగన్ కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగులే నిదర్శనమని, ప్రతి అడుగూ రైతన్నకు మంచి జరగాలి, పేద వాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ,లు, నా మైనార్టీలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, గొప్పగా చదవాలి, ఎదగాలని ఎంతో తపిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనదని సీఎం స్పష్టం చేశారు.

*చంద్రబాబుకు మంచి చేయాలనే ఆలోచనలు ఎందుకు రాలేదు?*

గతంలో ఎప్పుడూ జరగని విధంగా, వైయస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితోపాటు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ రైతులకు, ఆర్వోఎఫ్ ఆర్ రైతులకు రూ.13500 చొప్పు న ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా? 14 సంవత్సరాలు సీఎంగా ఉండి, మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని కూడా రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు బుర్రలో ఎందుకు రాలేదని సీఎం జగన్‌ ప్రశ్నించారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నది మన ప్రభుత్వం మాత్రమేనని, గతంలో పగలూ, రాత్రి రెండు సమయాల్లో కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా వ్యవసాయానికి ఎందుకు కరెంటు ఇవ్వలేదని సీఎం జగన్‌ ప్రశ్నించారు. వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు 1700 కోట్లు ఖర్చు చేశామన్నారు. పంటల బీమాగా రైతన్న ఒక్క రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంను కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ, రైతన్నకు తోడుగా నిలబడుతున్న పరిస్థితులు చూస్తున్నామని సీఎం తెలిపారు. 53 నెలల కాలంలో దేవుడి దయతో నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదన్నారు. చంద్రబాబు హయాంలో వరుసగా 5 సంవత్సరాలు కరువే కరువు అని ఎద్దేవా చేశారు.

*ప్రజలు ఆలోచించాలి.. అబ్దాలను నమ్మవద్దు*

స్కిల్ డెవపల్ మెంట్ ఒకస్కామ్, ఫైబర్ గ్రిడ్, మద్యం, ఇసుక ఇంకో స్కామ్. రాజధాని భూములు ఇంకో స్కాం ఇలా చంద్రబాబు పేరు చెబతే స్కామ్‌లే గుర్తుకు వస్తాయని, స్కీములు గుర్తుకు రావని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు అధికారంలోకి రావడానికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆ మాటలు నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చాడు. రైతులను మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేట్టుగా చేశాడు. రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. అప్పటిదాకా ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చాడు. ముస్టి వేసినట్లు రూ.15 వేల కోట్లు విదిల్చిన పరిస్థితులు. ఈరోజు మీ బిడ్డ హయాంలో నాలుగు సంవత్సరాల కాలం 53 నెలల పాలనలో ఎక్కడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి రాలేదు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలన్నది ఆలోచన చేయాలి. ప్రజలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, చదువుకుంటున్న పిల్లలకు, నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు. చంద్రబాబుకు అధికారం కావాల్సింది కేవలం తాను, తనతోపాటు ఒక గజదొంగల ముఠా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదీ చంద్రబాబు గజదొంగల ముఠా. ఈ గజదొంగల ముఠాకు అధికారం కావాల్సింది రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకొనేందుకు కావాలి అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Post midle

Comments are closed.