The South9
The news is by your side.

పూజా కార్యక్రమం తో ప్రారంభమైన హారర్, థ్రిల్లర్ చిత్రం.

after image

శివారెడ్డి, స్పందన పల్లి ముఖ్య పాత్రలు పోషిస్తు, యువ తారలు కథ కథానాయకులుగా తెరకెక్కుతున్న తాజా చిత్ర పూజా కార్యక్రమం ఈరోజు బంజారాహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని గుణ పాటి సురేష్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో … రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, రాజ్ కుమార్ చందక, సిహెచ్ రామ్ నాధ్, సిద్ధార్థ రెడ్డి, నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్నో చిత్రాలకు సీనియర్ కో డైరెక్టర్ గా పనిచేసిన రఘు వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ…. హారర్, థ్రిల్లర్, గా, కొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని. రూపొందిస్తున్నామని, అన్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూలై మొదటి వారం నుంచి హైదరాబాద్, వైజాగ్, నెల్లూరు, నగరాలలో ప్రారంభం కాబోతోందని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు దర్శకుడు రఘువర్ధన్ రెడ్డి. ఈ పూజా కార్యక్రమానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, నిర్మాతలు రాజ్ కుమార్, చందక‌‌‌, గుణపాటి సురేష్ రెడ్డి, నటులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.                                       ఈ చిత్రానికి సంగీతం_ డి ఎస్ ఆర్, సినిమాటోగ్రఫీ_హజరత్ షేక్, నిర్వహణ _బాలాజీ శీను

Post midle

Comments are closed.