The South9
The news is by your side.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన

after image

 

తేదీ: 23-06-2022,
శ్రీకాళహస్తి, తిరుపతి.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన

అపాచీ పరిశ్రమలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్లు వంటి ఉత్పత్తుల తయారీ.                                  మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్ల పెట్టుబడి 

అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం పదివేల మందికి ఉపాధి

రానున్న రెండేళ్లలో ఉత్పత్తికి సిద్ధమవనున్న ఇనగలూరు అపాచీ యూనిట్

Post Inner vinod found

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా(అపాచీ గ్రూప్)కి భూ కేటాయింపుల పత్రాన్ని ఆ సంస్థ సీఈవో టోనీకి అందజేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది

Post midle

ఎకరాకి రూ. 6,50000 చొప్పున 298 ఎకరాల అన్ డెవలప్డ్ ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ అలాట్ మెంట్ లెటర్ అందజేత

సర్వే నంబర్ 181, 451, 452, 453, 454 లోని భూములలో మొదటి విడతగా రూ.350 కోట్లు, రెండో విడతలో మరో రూ.350 కోట్లు…మొత్తంగా రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అపాచీ

మహిళలకే 80 శాతం ఉద్యోగాలతో ఈ యూనిట్ ద్వారా 10వేల మందికి ఉపాధి అవకాశాలు

ముఖ్యమంత్రి సహకారం, పరిశ్రమల మంత్రి చొరవ, పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపిన హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా (అపాచీ)

హాజరైన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, విద్యుత్ , అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంఎల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి, ఎడ్యుకేషన్ కమ్యూనిటీ, డెవలప్మెంట్ ఛైర్మన్ నేదురుమల్లి రామ్ , ఏపీఐఐసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ (వెంకటగిరి) ఆవుల సుకన్య, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా (అపాచీ) సీఈవో టోనీ, వైస్ ప్రెసిడెంట్ సెర్గియో లీ, ఇతర ఉన్నతాధికారులు, ప్రతినిధలు.

Post midle

Leave A Reply

Your email address will not be published.