The South9
The news is by your side.

నేను ఆరోగ్యంగానే ఉన్నాను :నటి శారద

post top

అల నాటి ప్రముఖ నటి ఊర్వశి శారద అనారోగ్యంతో మృతి చెందినట్లు ఈరోజు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులు , ఈ వార్త వినగానే చాలా ఆవేదనకి , ఆందోళనకి లోనయ్యారు. ఈ వార్తలో నిజం ఎంత వరకు ఉందని ఆమె అభిమానులు ఆరా తీయడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో తన మృతి చెందినట్లు ప్రచారం జరిగిన వార్త నటి శారద దృష్టికి ఆమె అభిమానులు తీసుకెళ్లగా ఆ వార్తపై శారదా స్పందించారు…. శారద మాట్లాడుతూ…..‌నేను బతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఒంట్లో కాస్త నలతగా ఉంది. దయచేసి వాట్సాప్‌లలో వచ్చే వాటిని నమ్మకండి. ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం.                            అంటూ ఒక ప్రకటనను విడుదల చేశారు. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు పొందిన శారద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో లో తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.