The South9
The news is by your side.
after image

గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రానికి రూ. 25,800 వేల కోట్ల పెట్టుబడులు… సీఎం జగన్.

post top

*తేదీ: 23-08-2023*

స్థలం: తాడేపల్లి*

 

*గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రానికి రూ. 25,800 వేల కోట్ల పెట్టుబడులు… సీఎం జగన్*

*రూ. 10 వేల కోట్ల విలువైన ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ హెచ్ పీసీతో ఒప్పందం*

*మెగావాట్ కు లక్ష చొప్పుల ప్రభుత్వానికి వందేళ్ల పాటు రాయల్టీ ఆదాయం*

 

*3 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు*

 

*గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా ఏపీ…. సీఎం జగన్*

 

Post midle

గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ర్టానికి రూ. 25,800 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎం జగన్ ప్రకటించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా 4,300 మెగావాట్ల సామర్థ్యమున్న ఎం ఎం గ్రీన్ కో, ఆర్సిలర్ యుటెల్, ఎకోరెన్ గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు చెందిన సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులతో రాష్ర్టానికి గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 25,800 కోట్ల పెట్టుడులతో దాదాపు 6 వేలకు పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో భవిష్యత్తులో వందేళ్ల పాటు మెగావాట్ కు లక్ష రూపాయల చొప్పున రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వివరించారు. తాజా ప్రాజెక్టులతో ఏపీ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు అవుతున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

 

నంద్యాల జిల్లాలోని అవుకు, పాణ్యం, బేతంచెర్ల, డోన్‌ మండలాల్లో ఈ సోలార్‌, విండ్‌ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. అవుకు మండలంలో జూనూతల, ఉప్పలపాడు, కొండమనాయునిపల్లి గ్రామాల్లో గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 2,300 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎంగ్రీన్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 700 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, 300 మెగా వాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టు, బేతంచెర్ల మండలం ముద్దవరం, డోన్‌ మండల కేంద్రంలో ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 1000 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, 1000 మెగా వాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయిని, మరో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కోసం ఎన్‌హెచ్‌పీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సీఎం జగన్ వివరించారు.

 

Post Inner vinod found

*8 వేల ఎకరాల్లో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్లాంట్*

 

తాజా పెట్టుబడులతో రాష్ట్రంలో 8 వేల ఎకరాల్లో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుందని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రీన్‌కో ఎనర్జీకి సంబంధించి సౌర విద్యుత్‌ ప్రాజెక్టు దాదాపుగా రూ. 10,350 కోట్ల పెట్టుబడితో 2300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రాజెక్టు ఇదని, దీనితో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని సీఎం వెల్లడించారు. 16 వేల మిలియన్‌ యూనిట్లకు సంబంధించి సోలార్ ఎనర్జీ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రూ 2.49 పైసలతో ఎంఓయూ చేసుకున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది సహాయపడుతుందని, భవిష్యత్తులో ప్రభుత్వం పై కానీ, ధర్మల్ పవర్ స్టేషన్ పై కానీ భారం పడకుండా రైతులు ఉచిత విద్యుత్ అందించేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాని చెప్పారు. అంతేకాకుండా మరికొన్ని చోట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తామని పేర్కొన్నారు.గ్రీని ఎనర్జీ ఉత్పత్తి చేసే విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని హమీ ఇచ్చారు.

 

*భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులే ఆధారం*

 

పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ అందుతుందని సీఎం పేర్కొన్నారు. కాలుష్య కారక విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుందని, భవిష్యత్తులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వీటికి అనుబంధంగా సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్‌ ఎనర్జీలో విప్లవానికి దారితీస్తాయని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకూ సోలార్‌ వస్తుందని, సాయంత్రం నుంచి తెల్లవారుజామువరకు విండ్‌ ఎనర్జీని వాడుకోవచ్చని, పీక్‌ అవర్స్‌లో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను వినియోగించుకుంటామని సీఎం వెల్లడించారు. ఒక కృత్రిమ బ్యాటరీగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు పనిచేస్తాయని, కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పాదనలో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా ఈ అడుగులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఏపీలో 8999 మెగావాట్లకు సంబంధించి సోలార్‌, విండ్‌ పవర్‌ ఉందని, రైతులకు ఉచితంగా పగటిపూటే విద్యుత్తు అందుబాటులోకి రావాలని, 7200 మెగావాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రూ.2.49లకే ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.

 

*రూ. 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం*

 

29 ప్రాజెక్టులకు సంబంధించి 33వేల మెగావాట్లకు పైగా ప్రాజెక్టు నివేదికలు, కొన్ని డీపీఆర్‌లు కూడా సిద్ధమైయ్యాయని వివిధ కంపెనీలకు అలాట్‌మెంట్‌కూడా చేశామన్నారు. ఇందులో భాగంగానే NHPCతో ఒప్పందం చేసుకుంటున్నామని, యాగంటిలో, కమలపాడులో దాదాపుగా 2వేల మెగావాట్లకు సంబంధించి రూ.10వేల కోట్లతో చెరిసగం వాటాతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకుంటున్నాని, ఈరెండు సంస్థలూ మరింతగా అడుగులు ముందుకేసేందుకు మరో 3700 మెగావాట్లకు సంబంధించిన ఫీజబిలిటీ స్టడీలు జరగుతున్నాయని తెలిపారు.

 

*వందేళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం*

ప్రతి మెగావాట్‌ ఉత్పత్తికి ఈ ప్రాజెక్టుల నుంచి వందేళ్ల పాటు రాయల్టీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ. లక్ష చొప్పున ఆదాయంతో పాటు జీఎస్టీ ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ప్రాజెక్టులకు సహకారం అందిస్తున్న రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు లీజు పేరున ఆదాయం వస్తుందన్నారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము పెరుగుతుందని, ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులకు మంచి జరుగుతుడంతో పాటు యువతకు స్థానికంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

Post midle

Comments are closed.