The South9
The news is by your side.

శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్ స్థానం ప్రత్యేకం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

post top

*శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్ స్థానం ప్రత్యేకం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: సంగంలో భారత అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే*

 

*ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ స్థానం ప్రత్యేకమైనదని, అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి రాకెట్లు పంపగల సత్తా మన శాస్త్రవేత్తలకు ఉందని, భవిష్యత్తు కాలంలో ప్రతి దేశం మన దేశం నుంచే ఇలాంటి ప్రయోగాలను చేపట్టే విధంగా అభివృద్ది సాధిస్తుందని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*

 

*గురువారం సంగంలోని జిబికెఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న భారత అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.*

 

*తొలుత మాజీ రాష్ట్రపతి అబ్థుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ఎమ్మెల్యే మేకపాటి ప్రారంభించారు.*

 

*అనంతరం భారత అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ తాను చదువకునే సమయంలో కంప్యూటర్ వాడకం అప్పుడప్పుడే ప్రారంభించారని, ప్రస్తుతం కంప్యూటర్ లేనిదే ఏ పని చేయలేని పరిస్థితుల్లోకి వచ్చామని అన్నారు. అంటే సాంకేతికాభివృద్ది 40 ఏళ్ల కాలంలో ఏ విధంగా అభివృద్ది చెందిందో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.*

after image

Post midle

*గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని, రాకెట్ సైన్స్ వైపు విద్యార్థులు మొగ్గుచూపేలా మీరందరూ విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఇలాంటి ప్రాంతాల్లో అవసరమైన శాస్త్రసాంకేతికాభివృద్దికి సంబంధించి శిక్షణా సంస్థలు ఏర్పాటుకు తమ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.*

*రానున్న 40 సంవత్సరాల కాలంలో శాస్త్రసాంకేతికాభివృద్దిలో మన దేశం వైపు అన్ని దేశాల చూసే విధంగా అభివృద్ది సాధిస్తుందని, ఆ అభివృద్దిలో భవిష్యత్తు తరాలను భాగస్వాములను చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులుగా తమపై ఉందని అన్నారు.*

 

*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విద్య వ్యవస్థలో చేసిన సంస్కరణల కారణంగా ఆధునిక విద్య ప్రస్తుతం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని, ఆంగ్ల విద్య, డిజిటల్ క్లాస్ రూంలు, నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేక కోర్సులు, ఉన్నత విద్య చదివే వారికి ప్రోత్సహకాలు అందిస్తారని అన్నారు.*

 

*విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.