The South9
The news is by your side.

ఇట్లు ఇంకో శిష్యుడు సుకుమార్_దర్శకుడు సుకుమార్

post top

మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ నిర్మాణ సారథ్యంలో లో ఉప్పెన చిత్రం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్, కీర్తి శెట్టి, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం మొదటిరోజు మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం 50 కోట్ల షేర్ వసూలు చేసిందని ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే దర్శకుడు గురువు సుకుమార్ వినూత్నంగా తన శిష్యుడు సాధించిన విజయాన్ని అక్షర రూపం తో… నువ్వు నన్ను గురువును చేసేసరికి నాకు నేను శిష్యుడై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏమి నేర్చుకున్నాం…? అని నాకు నేను శిష్యుని అయితే తప్ప అదేంటో తెలుసుకో లేను. నా లోకి నన్ను అన్వేషించే లా చేసిన సా “నా”బుచ్చి బాబు ని “ఉప్పెన’అంత ప్రేమతో అభినందిస్తూ….. సుకుమార్ ఇంకో శిష్యుడు…. సుకుమార్ అంటూ వైవిధ్యం గా.. తన మాటలను పేస్ బుక్ ద్వారా అభిమానులకి ఈ విధంగా తెలియజేశాడు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.