ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల లో భాగంగా అమ్మ వడి రొండు వ విడత నిధులు విడుదల కార్యక్రమం సూపర్ సక్సెస్ గా సాగింది. పంచాయతీ ఎన్నికలు కోడ్ ఉన్నందున అసలు సభ జరుగుతుందా లేదా అని గత రొండు రోజుల గా ఉత్కంఠ భరితంగా సాగిన వ్యవహారం నిన్న సాయంత్రం నకు ఖచ్చితంగా జరుగుతుంది అని తేల్చి చెప్పడంతో వైస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుకున్నా సమయం కన్నా అరగంట లేటు గా వచ్చిన సభ ప్రాంగణం అంత ప్రజల తో కిక్కిరిసిపోయనది.జగన్ మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ వడి శ్రీరామ రక్ష లాగా ఉంటుందని, పేద ప్రజలు ఉన్నత చదువులు లక్ష్యం తో నే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మని అన్నారు. గత19 నెలల గా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని అని అన్నారు. అమ్మవడి ద్వారా ప్రతి ఏడాది 15000.వేలు చొప్పున వేస్తున్నామని అన్నారు. గత ఏడాది 42 లక్షల మందికి ఈ సహాయం అందితే ఇప్పుడు44.48.865 మందికి అమ్మ వడి పథకం ద్వారా అందుతుంది అన్నారు. వచ్చే ఏడాది డబ్బులు వద్దు అనుకుంటే లాప్ టాప్ ఇస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు. జిల్లా ఇంచార్జి మంత్రి. జిల్లా శాసనసభ్యులు, అధికారులు వైస్సార్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.