The South9
The news is by your side.

జగనన్న అందరి ఆశీర్వాదంతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

*జగనన్న అందరి ఆశీర్వాదంతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

 

రాష్ట్ర ప్రజలందరికి తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

 

after image

కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ 40 మంది వేద పండితులతో కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో నిర్వహిస్తున్న శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర మహా రుద్రాభిషేకం, సుదర్శనయాగంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా నిర్వహించిన రుద్రాభిషేకం, సుదర్శనయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా రాష్ట్ర ప్రజలందరికి సంక్షేమాభివృద్ది పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే సంకల్పంతో ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేస్తామని అన్నారు.

 

ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిర్వహించిన ఈ రుద్రాభిషేకం, సుదర్శనయాగంలో పాలుపంచుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ప్రజల అందరి దీవెనలతో పాటు సకల దేవతల ఆశీర్వాదంతో మళ్లీ సంక్షేమ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని, ఇది ప్రజలందరి విశ్వాసమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.