The South9
The news is by your side.
after image

ప్రముఖ వ్యాపారవేత్త కాశి కొండ ఆధ్వర్యంలో కనివిని ఎరుగని రీతిలో కనుమ వేడుక.

post top

ఆహుతులకు ప్రత్యేక స్వాగతం

గంధం పన్నీరుతో పలకరింపు

హైదరాబాదు నుంచి ప్రముఖ గాయకులతో భక్తి గీతాలు

పాల్గొన్న నగర రాజకీయ వ్యాపార మీడియా ప్రముఖులు

Post Inner vinod found

నెల్లూరు ప్రత్యేక ప్రతినిధి :

కనుమ పండుగ పురస్కరించుకొని ప్రముఖ వ్యాపారవేత్త కాశి కొండ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో కనుమ వేడుకని నిర్వహించారు.

తన మిత్రులకు పలు వ్యాపార ప్రముఖులకు ఈ వేడుకకు సంబంధించి గత రెండు మూడు రోజులుగా, వినూత్న రీతిలో ఆహ్వానం అందించారు కాశి కొండ. హైదరాబాద్ నగరానికి పరిమితమైన డ్రెస్ కోడ్ ని మొట్టమొదటిసారిగా నెల్లూరులో ప్రవేశపెట్టి అందరిని, అబ్బురు పరిచారు.

Post midle

ఇప్పటివరకు బహుశా నెల్లూరు నగరంలో ఎవరు చేయని విధంగా ఆహ్వానితులకు ప్రతి ఒక్కరిని, పూలమాలతో స్వాగతం పలుకుతూ, గంధం పూసి పన్నీరు చల్లి వేడుక లోపలికి ఆహ్వానంపలకడం జరిగింది. వేడుక కు విచ్చేసిన అందరూ, మునుపెన్నడు ఇటువంటి వేడుక చూడలేదని, ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని కార్యక్రమం నిర్వాహకుడు కాశీ కొండని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు, మిత్రులు, తదితరులు పాల్గొన్నారు

Post midle

Comments are closed.