
South 9
వెండి తెరపై 25 ఏళ్ల దండయాత్రను “పూరి” రించిన ‘జగ(పె)న్’
–
చంటి గాడు లొకల్… సిటీకి ఎంతో మంది పోలీస్ కమిషనర్లు వస్తుంటారు, , చంటి గాడు మాత్రం లొకల్ అనే తూటా డైలాగ్‌తో అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరించిన మాస్ మాంత్రికుడు…
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు.

తన పెన్నుతో, తన స్క్రీన్ ట్రీట్‌మెంట్‌తో హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి, యువతలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. దర్శకుడిగా 25 ఏళ్ల ప్రస్థానం… ఆ ప్రస్థానంలో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, కొన్ని ఫ్లాపులు… కానీ హిట్లకు పొంగని, ఫ్లాపులకు లొంగని యోధుడు ఆయన.
“సినిమా… సినిమా… సినిమా” అనే ఒకే ఓ మతంతో, తనదైన శైలిలో సాగిన ఈ ప్రయాణం బాలీవుడ్‌ని కూడా తలెత్తిచూసే స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి ఒక్కరినీ “భయ్యా” అని ప్రేమగా పిలవడం, తనలో ఉన్న మానవత్వం అతని మాటలలో కనిపిస్తుంది.

తెలుగు సినిమా పరిశ్రమకు పూరి జగన్నాథ్ ఎంత అవసరమో తెలియదు కానీ, ప్రతి ఊరిలో మాస్ ఆడియన్స్‌కి, మల్టీప్లెక్స్ లొ కూర్చొని whistle వేయలేని ప్రేక్షకుల మనసుల్లో, “ఏమి చూపించాడు రా హీరోయిన్‌ని!” అనే కామెంట్స్ చెయ్యించే కుర్రకార్లో ఆయన శాశ్వతమైన స్థానాన్ని సంపాదించారు.
“జీవితం ఒక యుద్ధం… దేవుడు మమ్మల్ని ఓవర్‌జోన్‌లో పడేసాడు…” అంటూ చెప్పిన మాటలు కోట్ల మంది మనసులను తాకిన ప్రేరణ మాటలు. అలాంటి మీ కలానికి శతకోటిసలాంలు… మేము కోరుకునేది ఒక్కటే – మళ్లీ మళ్లీ మీ సినిమాల ద్వారా మమ్మల్ని అలరించాలి, ప్రభావితం చేయాలి.
come back puri సార్
Comments are closed.