
south9 ప్రతినిధి

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం కన్నప్ప ఈ మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు ఈ చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదిక పోస్ట్ పెట్టింది పరమశివుని గొప్ప భక్తుడు కన్నప్ప గురించి ఇప్పటివరకు ఎవ్వరు చెప్పని కథను చూసేందుకు మీ క్యాలెండర్లో డేటును మార్క్ చేసుకోండి 2025 ఏప్రిల్ 25న వెండితెర పైకి రావడానికి సిద్ధంగా ఉంది పురాణ సినిమా ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని చిత్ర బృందం తెలిపింది. కాగా కన్నప్పలో మోహన్ బాబుతో పాటు మోహన్లాల్ ప్రభాస్ శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కాజల్ వంటి హేమా హేమీలు నటిస్తున్నారు పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం రూపొందుతోంది మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆవా ఎంతటైన్మెంట్ బేనర్లపై ఈ చిత్రం రూపొందుతోంది.
Comments are closed.