
south 9 ప్రతినిధి

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ సంచల విషయాన్ని వెల్లడించారు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తర్వాతపలువురు తనకు ఇచ్చిన సలహాలు పాటించి ఉంటే ఈపాటికి మానసికంగా ప్రశాంతత పాటు కోల్పోయే వాడిని చెప్పుకొచ్చారు 2017 లో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు అభిమానులతో సభలు సమావేశాలు నిర్వహించారు తమిళనాట ఆయనకున్న ఫాలోయింగ్ బట్టి రజిని గెలుపు ని నల్లేరు మీద నడకేనని అందరూ భావించారు ఒకానొక సమయంలో బిజెపి ఆయనతో జతకట్టేందుకు కూడా సిద్ధమైంది అయితే ఆ తర్వాత ఏమైందో కానీ వెనకడుగు వేశారు.
అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య జానకి రామచంద్ర న్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన రజినీకాంత్ నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఎదురైన అనుభవాలను పంచుకున్నారు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించిన తర్వాత నేను చాలామందిని కలిశాను ఆ సమయంలో నాకు చాలా మంది సలహాలు ఇచ్చారు వాటిని కనుక నేను పాటించి ఉంటే ప్రశాంతత డబ్బులు పోగొట్టుకొని ఉండేవాడిని అయితే వారు ఆ సలహాలు తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారో నాకు తెలియదు కానీ కానీ ఆయనకు ఎవరు ఏమి సలహాలు ఇచ్చారు అనే విషయాలను మాత్రం రజనీ బయట పెట్టలేదు
Comments are closed.