The South9
The news is by your side.

జగనన్నకు చెబుదాం” ప్రారంభించిన సీఎం జగన్

post top

 

*09-05-2023*

*తాడేపల్లి*

*”ప్రజా ఫిర్యాదులపై.. నేరుగా మీ సీఎం జగనన్నకే ఫోన్”*

*”జగనన్నకు చెబుదాం” ప్రారంభించిన సీఎం జగన్*

 

*”1902″ నెంబర్ కు ఫోన్ చేస్తే నేరుగా సీఎం కార్యాలయానికే కనెక్ట్*

*ప్రతి ఫిర్యాదుకు “YSR ID” (యువర్ సర్వీస్ రెఫరెన్స్ ఐడీ)*

 

Post midle

*”ప్రజలకు సేవ చేసేందుకే ప్రభుత్వ యంత్రాంగం.. ఇది మీ ప్రభుత్వం..” సీఎం జగన్*

 

after image

ప్రజా ఫిర్యాదులకు సత్వర, మెరుగైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా.. ఇప్పటి వరకు ప్రయత్నించి పరిష్కారం కాని ప్రజా ఫిర్యాదులు, సంక్షేమ పథకాలు, భూ సంబంధిత, ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన అంశాలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేసి ప్రజలు తమ సమస్యను పరిష్కరించుకునేలా చూసేందుకు ప్రతిష్టాత్మక “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించి వారి ముఖంలో ఆనందం చూడటమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మంగళవారం నాడు సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ర్టంలోని ఆర్బీకేలు మొదలు.. కలెక్టర్ కార్యాలయాల్లోని 1.5 లక్షల మంది ప్రభుత్వ యంత్రాంగానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలు తీరుపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రజలకు తమ ఫిర్యాదులను నేరుగా మీ సీఎం జగనన్నకే చేరవేసేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఉంటుందని వివిరంచారు. ఫిర్యాదుదారులు *1902* ఫోన్ చేస్తే నేరుగా సీఎం కార్యాలయానికే కనెక్ట్ అవుతుందని, ప్రతి ఫిర్యాదుకు *YSR ID* (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ ఐడీ) ఇస్తూ ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు ప్రతి దశను సీఎం కార్యాలయం ట్రాక్ చేస్తుందని వివరించారు. మీ సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారాలు చూపుతామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలందడంలో సమస్యలుంటే ప్రజలు నేరుగా మీ బిడ్డకే ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ప్రభుత్వ యంత్రాంగం ఉందని ఇది మీ ప్రభుత్వం భావించి ఫిర్యాదులు పరిష్కరించుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

“సుపరిపాలనలో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం గతంలో స్పందనను విజయవంతంగా నిర్వహించాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సింది ఖచ్చితంగా అందేలా చేయడమే లక్ష్యంగా వారి సమస్యలు విజయవంతంగా పరిష్కరించింది. స్పందనతో మరింత మెరుగైన పాలన అందించేలా గత నాలుగేళ్లు ప్రభుత్వం పనిచేసింది. స్పందనను మరింత మెరుగ్గా అమలు చేసేలా సీఎం పేరును జోడిస్తూ సరికొత్త కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రజలు అర్హులైన వాటిని అందుకోలేకపోయినా.. న్యాయం ప్రజల వైపు ఉండి వారికి జరగకపోయినా.. వాటికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం వేదిక కానుంది. మారుమూల గ్రామ సచివాలయం నుంచి కలెక్టరేట్, సీఎం కార్యాలయం వరకు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తున్నాం.” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

*మండల స్థాయి నుంచి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు*

 

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ప్రజా ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించేందుకు మండల, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక మానిటరింగ్ యూనిట్లు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. ఈ మానిటరింగ్ యూనిట్లను నేరుగా సీఎం కార్యాలయమే పర్యవేక్షిస్తుందని తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి ప్రత్యేకంగా మానిటర్ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఉంటాయని, ప్రభుత్వ అధికారుల్లో బాధ్యత మరింత పెంచడం కోసమే కార్యక్రమానికి సీఎం పేరు చేర్చినట్లు వివరించారు. సీఎంవో, సీఎం, డీజీపీ కలిసి ఒకే వేదికగా జగనన్నకు చెబుదాంలో ప్రజల ఫిర్యాదులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని వివరించారు. ఫిర్యాదులు పరిష్కారం అయ్యాక యంత్రాంగం ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుందని తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మంచి చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

 

*ప్రజలకు మొదటి సేవకుడు ముఖ్యమంత్రే.. సీఎం జగన్*

 

పదవి స్థాయి పెరిగే కొద్దీ ప్రతి అధికారి, ప్రజాప్రతినిధులు ప్రజలకు అంత ఎక్కువ, మొదటి సేవకుడిగా మారతారని సీఎం జగన్ పేర్కొన్నారు. తనతోనే ఇది మొదలు అవుతుందని.. సీఎంగా తాను ఉన్నది అధికారం చెలాయించడానికి కాదని ప్రజలకు మొదటి సేవకుడిగా ఉండటానికే అని వివరించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉద్దేశిస్తూ మనం ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకేనని తన నుంచి వలంటీర్ వరకు ఇదే సూత్రం వర్తిస్తుందని అధికార యంత్రాంగం కలిసికట్టుగా ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం చేస్తున్న గొప్ప కార్యక్రమంగా జగనన్నకు చెబుదాం ఉండాలని సీఎం జగన్ సూచించారు. అందుకే రాష్ర్టంలోని ప్రతి ప్రభుత్వ అధికార కేంద్రం నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ మొదలు సర్పంచ్, వలంటీర్ల వరకు అందరినీ ఈ ప్రోగ్రాంలో భాగస్వాములను చేసినట్లు వివరించారు.

 

*స్పందన కంటే మెరుగ్గా “జగనన్నకు చెబుదాం”*

 

గత నాలుగేళ్లు ప్రభుత్వం అమలు చేసిన స్పందన కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేసి ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూసేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన ఇదే రీతిలో సాగిందని, తన 3468 కిలోమీటర్ల పాదయాత్రలో చాలా సమస్యలపై నాటి ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే పెండింగ్ ఉన్నట్లు గుర్తించానని వివరించారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తే ఈ సమస్యలు సులభంగా పరిష్కారం అయ్యేవని అభిప్రాయపడ్డారు. పండు ముసలికి పెన్షన్ ఇవ్వడానికి కూడా జన్మభూమి కమిటీలు సిఫారసు చేసే దౌర్భాగ్య పరిస్థితి గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఉండేదని విమర్శించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఇవన్నీ చూసి చలించిపోయి లంచాలు, వివక్షలేని పాలన ప్రజలకు ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి అందే ప్రతి రూపాయి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలకు వారి హక్కుగా తీసుకునే పరిస్థితి తీసుకొచ్చామని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యత పెంచామని. గ్రామ వార్డు సచివాలయాలే అందుకు నిదర్శమని వివరించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా చేయి పట్టుకు నడిపించేలా సచివాలయాలను తీర్చిదిద్దినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. లబ్ధిదారుల వివరాలను సోషల్ ఆడిట్ చేసిన నిజాయితీ ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని వివరించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.