The South9
The news is by your side.

ఉత్తరాంధ్రలో సర్కారు వారి పాట ప్రభంజనం!

after image

సినీ బ్యూరో : మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో వేసవి కానుకగా విడుదలైన సర్కారు వారి పాట మిక్సడ్ టాక్ తెచ్చుకొని ముందుకు సాగుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ చిత్రం పై సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ ప్రచారం చేశారని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో టాక్ తో, సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సర్కారు వారి పాట. ఉత్తరాంధ్రలో చిత్రాన్ని 12 కోట్లకు అమ్మినట్లు సమాచారం అయితే పుష్ప,. కే జి ఎఫ్ 2 పూర్తి రన్ లో 8 కోట్లు వసూలు చేయగా సర్కారు వారి పాట తొలి నాలుగు రోజుల్లో ని ఆ ఫీట్ ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. మొదటిరోజు 3కోట్ల 27 లక్షలు షేర్ వసూలు చేయగా, తర్వాత రోజు 1,54 లక్షలు, మూడో రోజు కోటి యాభై ఐదు లక్షలు షేర్ వసూలు చేసినట్లు సమాచారం . ఉత్తరాంధ్ర అంతట ఆదివారం హౌస్ పుల్స్ గా ఉన్నదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన 8 కోట్లు దాటేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో 4 కోట్ల బ్రేక్ ఈవెన్ కూడా పెద్ద విషయం కాదని అభిమానులు అంటున్నారు. పుష్ప కే జి ఎఫ్ 2 రికార్డును తిరగ రాయడం తో మహేష్ అభిమానులు ఫుల్ జోష్ గా ఉన్నారు.

Post midle

Comments are closed.