The South9
The news is by your side.
after image

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనే ధ్యేయంగా ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ :సీఎం జగన్

post top

*తేది :18–10–2023*

*స్థలం -తాడేపల్లి*

*ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో మెరుగైన వైద్య సేవలు*

*అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం*

*ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనే ధ్యేయంగా ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ*

Post Inner vinod found

*ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షల నిర్వహణకు ప్రత్యేక క్యాంపులు ;సీఎం జగన్*

రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సత్వరం అందుతున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మెరుగైన వైద్యం అందించేలా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆరోగ్య సురక్ష క్యాంపులతో రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని ప్రత్యేకంగా గుర్తించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కోన్నారు. ప్రజారోగ్య సమస్యలకు ఆరోగ్య సురక్ష క్యాంపులు అండగా నిలుస్తున్నాయని హర్షం వ్వక్తం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో స్ర్తీ శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ బుధవారం నాడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సురక్ష క్యాంపుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపంతో గుర్తించిన చిన్నారులకు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైనంత కాలం మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందన్నారు. పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలని సూచించారు. చిన్నారులు, మహిళల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత లోపాలను నివారించేందుకు వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మధ్య సమన్వయంతో పనిచేయాలన్నారు. దీనివల్ల గ్రామస్థాయిలో రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించగలుగుతామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? రక్తహీనత సమస్య తగ్గుతుందా? లేదా? అన్నదానిపై వితేజ్ క్లినిక్స్ స్థాయిలో దృష్టి సారించాలన్నారు.

 

Post midle

*ఖాళీ పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు*

 

స్ర్తీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సంపూర్ణ పోషణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. అంగన్ వాడీలలో సూపర్‌ వైజరీ వ్యవస్ధ ఎలా పనిచేస్తుందన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న డ్రై రేషన్‌ పంపిణీ పైనా అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రేషన్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదన్నారు. సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందిస్తున్న సమయంలోనే గర్భిణీలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అని అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ టీకాలు మిస్‌ అయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? అన్నదానిపై కూడా అక్కడే పరిశీలన చేసి పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని సూచించారు. ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకుని పౌష్టికాహారం అందించాలన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ పీహెచ్ సీ పరిధిలో ప్రతినెలా కూడా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాలపై అవగాహణ కల్పించేలా క్యాంపులు నిర్వహించేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మండలం లేదా సచివాలయం పరిధఇలో ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలని సీఎం జగన్ సూచించారు.

Post midle

Comments are closed.