ద సౌత్ 9 మీడియా & వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమానికి సువర్ణ భూమి ఇన్ఫ్రా అధినేత బొల్లినేని శ్రీధర్ ని ఆహ్వానించిన మనపాటి చక్రవర్తి.

సౌత్ 9 ప్రతినిధి :
హైదరాబాద్ :
ద సౌత్ 9& వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమానికి రావాల్సిందిగా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న సువర్ణ భూమి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శ్రీధర్ ని కార్యక్రమ, నిర్వాహకుడు వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ మనపాటి చక్రవర్తి,ఆహ్వాన ప్రతిని అందజేసి కార్యక్రమానికి తప్పక హాజర అవ్వాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ విశేషాలను బొల్లినేని శ్రీధర్ అడిగి తెలుసుకున్నారు. తమ సొంత పట్టణమైన నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చక్రవర్తిని అభినందించారు.
ఖచ్చితంగా కార్యక్రమానికి హాజరవుతానని, తన వంతు,
సహాయ,సహకారాలు అందిస్తానని బొల్లినేని శ్రీధర్ అన్నారు.

సుమారు 40 నిమిషాల జరిగిన భేటీ సందర్భంగా సాదరంగా ఆహ్వానించిన సువర్ణ భూమి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శ్రీధర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు చక్రవర్తి.
Comments are closed.