The South9
The news is by your side.

మరోసారి పెద్ద మనసు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి

తెలంగాణ :      ( సిని బ్యూరో) ‌‌                                                                                                         దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది కుటుంబాలు వారి కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను, కోల్పోయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ లో చాలామంది ఆక్సిజన్ లేక ప్రాణాలు వదిలేసారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. మొదటిసారిగా దేశం మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్ కొరకు ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. ఏ హాస్పిటల్లో చూసినా ఆక్సిజన్ కొరతతో చనిపోయారని వార్తలు నిత్యం చూసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ వేరొక ప్రాంతం నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ ను దిగుమతి చేసుకోవడం , ఒక రాష్ట్రం మరొక రాష్ట్రానికి సరఫరా చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేశ మెగా స్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు లను ఏర్పాటు చేయాలని తలచారు. అనుకున్న

 

Post Inner

వెంటనే వాటికి సంబంధించిన కార్యచరణ ను వేగవంతంగా ముందుకు తీసుకు వెళ్లారు. ఒక తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని మెగాస్టార్ చిరంజీవి భావించారు. దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం, గుంటూరు జిల్లా కేంద్రాలలో ఆక్సిజన్ బ్యాంకుల సేవలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రేపటి నుంచి కరీంనగర్ ,ఖమ్మం తో పాటు మరొక ఐదు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయని చిరంజీవి తెలిపారు. ఇంత తొందరగా అందుబాటులోకి రావడానికి రామ్ చరణ్ కృషి కూడా ఉందని అన్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని చిరంజీవి ని విమర్శించడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. తన స్టార్ డం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సేవ చేయాలనే తలంపుతో, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, లను స్థాపించి ఎన్నో వేల, లక్షల మంది ప్రజలకు సేవలు అందించడంతో పాటు , ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం ఎన్నో అవార్డులు తో పాటు పద్మభూషణ్ తో ఆయనను సత్కరించింది. గత కరోనా సమయంలో కూడా సి.సి.ఎస్ అనే చారిటీ పెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన కార్మికులకు, వారి అవసరాల నిమిత్తం నిత్యావసరాలు అందించడం జరిగింది. ఇలా బయటక తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో, ఎవరి మెప్పు కోసమో, పేరు కోసమో, ఎన్నో చూసిన, ఎంతో చేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఎవరి కోసమో కొత్తగా చేయవలసిన అవసరం లేదు. ఆయనకి నిజంగా సేవ చేయాలనే దృక్పథం బలంగా ఉంది కాబట్టే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు విషయంలో తన పెద్ద మనస్సు ని మరొకసారి చాటకొన్నందుకు … ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంది.    ‘ద సౌత్ 9’

Post midle

Leave A Reply

Your email address will not be published.