(సినిమా బ్యూరో) ప్రముఖ పాన్ ఇండియా స్టార్, మన తెలుగు హీరో ప్రభాస్ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు అని రెండు రోజులుగా వివిధ మీడియా లో విస్తృతమైన ప్రచారం జరిగింది. ప్రముఖ హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాజిబుల్_7 లో హలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ తో కలిసి నటిస్తున్నాడని, ఆ దర్శకుడుక్రిస్టోఫర్ మెక్ క్వారీతో కలిసి కథా చర్చల్లో పాల్గొన్నారని విస్తృత ప్రచారం చేశారు. అయితే , ఇది ప్రచారమే కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని ఆ చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ స్పష్టం చేశారు . తన సినిమాలో ప్రభాస్ నటించడం లేదని ఇంతవరకు ప్రభాస్ ని కలవలేదని అన్నారు. దీంతో ఇది ప్రచారమే కానీ నిజం కాదని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలకు సమయం కేటాయించడానికి అటు, ఇటు గా చాలా సమయం పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో సినిమా అంటే ఇంకాస్త ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం ప్రభాస్ భారతీయ చిత్రాల కు పరిమితం.



Comments are closed.