The South9
The news is by your side.

ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు మెగాస్టార్ చిరంజీవి ఇంట సన్మానం

post top

ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు మెగాస్టార్ చిరంజీవి ఇంట సన్మానం

మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. అలాగే మెగా కుటుంబానికి చెందిన హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ వేడుకకు విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేసిన హీరో నితిన్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ సన్మానం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

after image

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.